👉 ఎమ్మెల్యేగా విజయం సాధించి నేటికి సంవత్సరం !
J.SURENDER KUMAR,
తన గెలుపు కోసం రాత్రి పగలు అహర్నిశలు కష్టపడిన కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు, శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే గా గెలుపొంది మంగళవారం నాటికి సంవత్సరం పూర్తి అయినా సందర్భంగా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మండల కాంగ్రెస్ పార్టీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
తన మీద నమ్మకం ఉంచి, తనను ధర్మపురి నియోజకవర్గ శాసన సభ్యుడిగా గెలిపించినందుకు నియోజకవర్గ సోదరీమణులకు, సోదరులకు, ప్రజానీకానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాననీ, ఎమ్మెల్యే అన్నారు.

తాను ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి తన శాయశక్తుల కృషి చేస్తాననీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.