ధర్మపురి ఆలయంలో పోటెత్తిన భక్తజనం !

👉 ధనుర్మాసంలో పురస్కరించుకొని..


J.SURENDER KUMAR,


ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున భక్తజనంతో కిటకిటలాడింది.
సోమవారం వైభవంగా ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాల నేపథ్యంలో భక్తజనం స్వామి వారి పూజాది కార్యక్రమాలు కనులారా తిలకించడానికి ఆలయానికి తరలివచ్చారు.

నెలరోజుల పాటు కొనసాగే ధనుర్మాస పూజాది కార్యక్రమాలలో ఇదే తరహాలో భక్తజనం రద్దీ కొనసాగుతుంది.


అర్చకుల, వేదపండితుల వేద పఠనం, మంగళ వాయిద్యాలు, అర్చకులు శ్రీ స్వామివారికి పంచోపనిషత్లతో అభిషేకం, స్వామివారికి నాగ, పంచ, కలశ పలు రకాల హారతులు, మంత్రపుష్పం, భజన కార్యక్రమంలు అత్యంత వైభవంగా నిర్వహించారు.


👉ఆండాళ్‌ తిరుప్పావైపారాయణం..


12 మంది ఆళ్వార్లలో
శ్రీ ఆండాళ్‌ (గోదాదేవి) ఒకరు, ఈమెను నాంచియార్‌ అని కూడా పిలుస్తారు.   
ద్వాపర యుగ తిరుమల శ్రీవారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు.