ధర్మపురిలో దండోరా మోగించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

👉 ఎమ్మెల్యేగా విజయం సాధించి రేపటికి సంవత్సరం !

👉 ధర్మపురిలో మూతపడిన తెలుగు కళాశాల పునః ప్రారంభం !

👉 దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న ముంపు బాధితులకు దాదాపు ₹ 20 కోట్లు పంపిణీ !

👉 పార్టీ తో ఉన్న వారికే పదవులు పట్టాభిషేకం !


J.SURENDER KUMAR,


నువ్వా ? నేనా ? అనే తరహాలో సిట్టింగ్ 

మంత్రి కొప్పుల ఈశ్వర్ పై ఐదు సార్లు 

ఓటమి చెందిన .. ప్రస్తుత ధర్మపురి ఎమ్మెల్యే ,

ప్రభుత్వ విప్  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  

2023 డిసెంబర్ 3న ఎమ్మెల్యేగా గెలిచి

సంవత్సరం క్రితం ధర్మపురి లో

దండోరా మోగించాడు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ పై 22039 (ఇరువది రెండు వేల ముప్పది తోమిధి ) ఓట్ల మెజార్టీతో విజయం కైవసం చేసుకున్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 2, 26, 880 ఓటర్లు ఉండగా. 1,81,690 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు 91,393 ఓట్లు పడ్డాయి. బీ ఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వరకు 69,354 ఓట్లు వచ్చాయి

👉 ఐదుసార్లు ఓడినా ప్రజాక్షేత్రంలోనే..

స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ 2009 నుంచి 2018 వరకు వరుసగా టిఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై ఓటమి చెందారు.

2009 లో ఆవిర్భవించిన ధర్మపురి అసెంబ్లీ (రిజర్వుడ్ ) నియోజకవర్గంలో 2009 ,2014, 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, టిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్, పై పోటీ చేస్తూ ఓటమి పొందుతున్నరు. లక్ష్మణ్ కుమార్ గత 14 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. 2023 ఎన్నికలు చావో రేవో అని లక్ష్మణ్ కుమార్ తో పాటు, ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు,  గెలుపు కోసం రాత్రి పగలు కష్టపడ్డారు.

ఎన్నికల అధికారి నుచి గెలుపు పత్రం అందుకుంటున్న దృశ్యం ( ఫైల్ ఫోటో )

👉 అక్రమ కేసులు, అవమానాలు కసి పెంచాయి

నాటి  అధికార బీఆర్ఎస్ శ్రేణులు, కొందరు అధికారులు చేసిన అవమానాలు లక్ష్మణ్ కుమార్ ను విజయం మెట్టెక్కేలా చేశాయి, వారు చేసిన నిందలు, అసత్య ఆరోపణలు, లక్ష్మణ్ కుమార్ ను, ఆయన అనుచర వర్గాన్ని వేధించడం, అక్రమ కేసులు నమోదు, కొంతకాలంగా  బిఆర్ఎస్ శ్రేణుల వేధింపులు, లక్ష్మణ్ కుమార్ తో పాటు, కాంగ్రెస్ శ్రేణులు సహనానికి పరీక్ష కాలంగా మారింది.

సమయం, సందర్భం లేకుండా టిఆర్ఎస్ శ్రేణుల హేళనలు, అక్రమ కేసులు, నిర్బంధాలు, ప్రత్యేకంగా ” లక్ష్మణ్ కుమార్ కు ఓడిపోవడం అలవాటు, మాకు గెలవడం అలవాటు అంటూ ” పదే పదే గల్లీ స్థాయి బీఆర్ఎస్  శ్రేణులు సైతం చేసిన వ్యాఖ్యానాలు, అవమానాలు, లక్ష్మణ్ కుమార్ తో పాటు ఆయన అనుచర వర్గంలో  కసి, గెలవాలి అనే పట్టుదల రగిలించాయి.  రాత్రి పగలు కష్టపడి లక్ష్మణ్ కుమార్, ఘన విజయానికి కారణం కాగా, దీనికి తోడు లక్ష్మణ్ కుమార్ పట్ల సానుభూతి, జోరుగా వీచిన కాంగ్రెస్ గాలి మరో కారణం అనేది నియోజకవర్గ ప్రజలకు తెలిసిన సత్యం.

👉 సంవత్సర కాలంలో ఎమ్మెల్యే చేసిన కొన్ని ..

ధర్మపురి క్షేత్రంలో 60 సంవత్సరాల చరిత్ర గల శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృత ఆంధ్ర కళాశాల ను టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు కేటాయించక సంవత్సరాల తరబడి మూసివేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి, పరిస్థితి వివరించి కళాశాలకు నిధులతో పాటు లెక్చరర్లను నియమించి  తెలుగు కళాశాలను పున ప్రారంభించారు..


👉 వెల్గటూరు మండలం సెగ్యామ ఎల్లంపల్లి ముంపు బాధితులు పది సంవత్సరాలుగా అందని నష్టపరిహారం దాదాపు ₹ 20 కోట్లు రూపాయలు మంజూరు పంపిణీ చేశారు.


👉 ధర్మపురి శివారులో 28 ఎకరాల స్థలంలో నిర్మించనున్న గురుకుల ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు .


👉 ధర్మారం మండలం పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటుకు స్థల సేకరణ నిధులు మంజూరు.


👉 కాంగ్రెస్ పార్టీకి కష్ట కాలంలో వెన్నంటి ఉన్న వారికే మార్కెట్ కమిటీ చైర్మన్,  డైరెక్టర్ పదవులు !

👉నియోజకవర్గంలో 2014-18. 2018 -2023 ( టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో) సింగిల్ విండోలో నిధుల దుర్వినియోగం తదితర అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఫలితంగా కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం జరిగినట్టు విచారణలో అధికారులు తేల్చారు. ఈ మేరకు ఆయా సింగల్ విండోల పాలకవర్గం, కార్యదర్శులు దుర్వినియోగమైన నిధులు చెల్లించాలని ప్రభుత్వం వీరికి నోటీసులు జారీ చేయడంతో పాటు ఆయా విండోల కార్యదర్శులను సస్పెండ్ చేసింది. ఈ ఉదంతంపై పలువురు ప్రజాస్వామ్యవాదులు ఎమ్మెల్యే చర్యను అభినందిస్తున్నారు.


పెండింగ్ లో ఉన్న సీఎం సహాయ నిధి షాది ముబారక్, ప్రజాసంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలు రాజకీయాలకతీతంగా ప్రస్తుతం జరుగుతున్నాయ ని చెప్పుకోవచ్చు.