ధర్మపురిలో పెన్షనర్స్ వార్షికోత్సవ వేడుకలు !


J.SURENDER KUMAR,


తెలంగాణా విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంస్థ, ధర్మపురీ శాఖ తమ ఆనవాయితీ గా ప్రతి సంవత్సరము నిర్వహించుకునే తరహాలో మంగళవారము తమ వార్షికోత్సవము జరుపుకున్నారు.


స్థానిక బ్రాహ్మణ సంఘ సేవా భవనము లో జరిగిన ఈ కార్యక్రమము లో పెన్షనర్ల ధర్మపురి శాఖా అధ్యక్షులు కొరిడె విశ్వనాథ శర్మ అధ్యక్షతన జరిగింది. సంగనభట్ల చిన్న రామకిష్టయ్య వందేమాతరం ప్రార్థన తో కార్యక్రమం ప్రారంభమైంది.


మొదటి దివంగత సభ్యులకు తమ సంతాపాన్ని తెలియజేస్తూ రెండు నిమిషాల మౌనం పాటించారు.
అధ్యక్షులు కొరిడె విశ్వనాథ శర్మ రిటైర్డ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. పెన్షనర్ల కున్న సమస్యలను ప్రస్తావించారు. పే సవరణ, కరువు భత్యము పెంపు మొదలై న విషయాలలో ప్రభుత్వాల నిర్లక్ష్యంగా పెన్షనర్లు పడుతున్న ఇబ్బందులు గురించి వివరించారు. అదే విధంగా హైకోర్టు ఆదేశించిన విధముగా సివీపీ కట్టింగ్ ను ఆపి పూర్తి పెన్షన్ ను అర్హులైన వారందరికీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.


మాజీ అధ్యక్షులు పానుగంటి దత్తాత్రి రిటైర్డ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పెన్షనర్ల సంఘం ప్రాదుర్భావ ఆవశ్యకతను వివరించారు. సుప్రీం కోర్టు గతములోనే పెన్షన్ అనేది విశ్రాంత ఉద్యోగులకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నదని , పెన్షన్ అనేది దయతో ఇచ్చే చెల్లింపు కాదు . వారి సేవల గుర్తింపుగా గౌరవంగా ఇచ్చే చెల్లింపు.‌ మీ సేవలకు గుర్తింపుగా మేము మీకు అందుబాటులో అన్నీ విధములుగా ఆదుకొంటామని , మీ వెంట ఉంటామనే ధైర్యాన్ని కలిగించే సేవ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పారని వివరించారు.


జిల్లా సలహాదారు అంబరీషాచార్య తమ ప్రసంగము లో హెల్త్ కార్డుల ఆవశ్యకతను వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ నరేశ్ బాబు మాట్లాడుతూ తమ బ్యాంకు పెన్షనర్లకు, వృద్ధులకు కల్పిస్తున్న లోన్లు , ఇన్సూరెన్స్, ఆదాయ పన్ను మినహాయింపులు మొధలైన సౌకర్యాలను వివరించారు. సభ్యులు అడిగిన అనేక ప్రశ్నలకు, అనుమానాలకు సంతృప్తి కరములైన సమాధానములు ఇచ్చారు.


కార్యదర్శి ఇందవరపు బండయ్య తమ వార్షిక నివేదిక ను చదివి వినిపించారు. చివరగా
ముఖ్య అతిథి , బ్యాంకు మేనేజర్ నరేశ్ బాబు గారిని మరియు సీనియర్ సభ్యులైన పెండ్యాల విశ్వనాథం , పుప్పాల మురళి , శ్రీ గొల్లపల్లి గుండయ్య లను సభాధ్యక్షులు , కార్యదర్శి, మరియు సభ్యులు శాలువాలతో సన్మానించారు కార్యదర్శి కృతజ్ఞతా ప్రకటనలు తరువాత “జనగణమన గీతము తో కార్యక్రమం ముగిసినది .


ఈ కార్యక్రమంలో కశోజ్ఝల సుధాకర్ , మ్యాన రాజయ్య , మహ్మద్ వౙీర్ , మతి గౌసం బేగం , కశోజ్ఝల రాజేశ్వర శర్మ , ఫణతుల శంకర శర్మ గారు, ఇందవరపు లక్ష్మీ కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.