J.SURENDER KUMAR,
ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో నేటి సాయంత్రం (సోమవారం) సాయంత్రం 6 గంటలకు అయ్యప్ప స్వామి వారి మహా పడి పూజ జరగనున్నది.
అయ్యప్ప దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో స్వామివారి పడిపూజ జరగనున్నదని, మహోత్సవంలో నియోజకవర్గ లోని అయ్యప్ప దీక్షపరులు మరియు భక్తులు, ప్రజలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని, స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం క్యాంపు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.
పూజ తదుపరి అయ్యప్ప స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకటంలో వివరించారు.
👉జిల్లా కేంద్రంలో..

జగిత్యాల జిల్లా కేంద్రంలోని నవదుర్గ పిట క్షేత్ర ఆలయంలో నిర్వహిస్తున్న మహా పడి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

👉మంచిర్యాల జిల్లాలో..

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఆదివారం రాత్రి జరిగిన అయ్యప్ప స్వామి వారి పడి పూజ మహోత్సవంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.