J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి హుండీలు ఆదాయం ₹.60,87,598/- మిశ్రమ బంగారము 55 గ్రాములు, మిశ్రమ వెండి 6 కిలోల 50 గ్రాములు మరియు విదేశి నొట్లు 27 వచ్చాయి. ఈ ఆదాయం కేవలం 97 రోజులకు సంబంధించింది మాత్రమే. శ్రీమతి ఎన్. సుప్రియ, సహాయ కమీషనర్, దేవాదాయశాఖ, కరీంనగర్ గారు దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఎస్. శ్రీనివాస్ పర్యవేక్షణలో సోమవారం లెక్కించారు.

ఉప ప్రధాన అర్చకులు శ్రీ నేరళ్ళ శ్రీనివాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ డి. కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీ ఎ.శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం, కోశాధికారి శ్రీ జక్కు దేవేంధర్ మరియు తిరుమల సేవా గ్రూప్ ఇంచార్జ్ శ్రీ రవీందర్ & సభ్యులు, కరీంనగర్ మరియు ధర్మపురి, లక్షేటిపేట సేవకులు, ఇతరులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మేనేజర్ & సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు దేవస్థాన అర్చకులు & సిబ్బంది, భక్తులు పాల్గోన్నారు.