👉 శాసనసభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి !
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రం, నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలని కోరుతూ ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాసనసభ లో ప్రభుత్వాన్ని కోరారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అసెంబ్లీలో ప్రభుత్వానికి ధర్మపురి లో రెవెన్యూ డివిజన్ ఆవశ్యకతను వివరిస్తూ ప్రసంగించారు.
ధర్మపురి నియోజక వర్గం అనేది ప్రముఖ పుణ్య క్షేత్రమని ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అధిక సంఖ్యలో ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని వివరించారు.
నియోజకవర్గంలో 90 శాతం ప్రజలు వ్యవసాయం పై ఆధార పడి జీవనం కొనసాగిస్తున్నరని కావున ధర్మపురినీ రెవెన్యూ డివిజన్ మంజూరు చేసేలా మంత్రి చర్యలు తీసుకోవాలని స్పీకర్ ద్వారా ఎమ్మెల్యే కోరారు.
అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ రెవెన్యూ మంత్రిని ఆయన చాంబర్ లో కలిసి
ధర్మపురి, వెలగటూర్, ఎండపల్లి, బీర్పూర్, సారంగాపూర్, బుగ్గారం మండల కేంద్రాలకు జగిత్యాల్ రెవెన్యూ డివిజన్ దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఉంటుందని, భూ సమస్యలు పరిష్కారం కోసం రైతులు. ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆయన వివరించారు.
మున్సిపాలిటీగా కొనసాగుతున్న ధర్మపురిలో కోర్టు, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం, అటవీ శాఖ రేంజ్ కార్యాలయం, అగ్నిమాపక కేంద్రం, 50 పడకల ఆసుపత్రి, ఆర్ అండ్ బి, పంచాయత్ రాజ్ సబ్ డివిజన్ కార్యాలయం, విద్యుత్ శాఖ సబ్ డివిజన్, ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం, ప్రభుత్వ డిగ్రీ, సంస్కృత కళాశాలలతో పాటు కస్తూరిబా, మైనారిటీ గురుకుల తదితర విద్యాసంస్థలు, నిజామాబాద్ జగదల్పూర్ 63 జాతీయ రహదారి ధర్మపురి నుండి పోతున్నదని మంత్రికి వివరించారు.
👉 8 సంవత్సరాల క్రితమే ఆందోళనలు !
ధర్మపురి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం 2016 జూన్ లో పట్టణ ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధులు అఖిలపక్ష కమిటీగా ఏర్పడి అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే కు వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు, ధర్నాలు, రాస్తారోకో, ఆందోళన చేపట్టారు.
నాడు ప్రతిపక్షంలో ఉన్న అడ్డూరి లక్ష్మణ్ కుమార్, తదితర నాయకులు ధర్నా లో పాల్గొని అప్పటి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. ధర్మపురి రెవెన్యూ డివిజన్ ఆవశ్యకతను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే లక్ష్యం కుమార్ తీరును నియోజకవర్గ ప్రజలు హర్షిస్తున్నారు.