ధర్మపురి నియోజకవర్గాని కే నవోదయ విద్యాలయం ?

J.SURENDER KUMAR,


కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి శుక్రవారం మంజూరు చేసిన 7 నవోదయ విద్యా సంస్థలలో జగిత్యాల జిల్లాకు కేటాయించిన విషయం తెలిసిందే. ఆ విద్యా సంస్థ ధర్మపురి నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్నట్లు విద్యావేత్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి కి గత కొన్ని నెలల క్రితం జవహర్ నవోదయ విద్యాలయం మంజూరుకు వినతి పత్రం ఇచ్చారు. అత్యధిక గ్రామీణ ప్రాంతాలు గల తన నియోజకవర్గానికి పాలిటెక్నిక్, ఐటిఐ, ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యా సంస్థల తో పాటు జవహర్ నవోదయ విద్యా సంస్థ మంజూరు కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.

ఇటీవల ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యా సంస్థ ను ప్రభుత్వం మంజూరు చేసింది. ( 27 ఎకరాల స్థలంలో కాంప్లెక్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం భూమిని సిద్ధం చేశారు ) గత ప్రభుత్వంలో సంవత్సరాల కాలం పాటు మూతపడిన ధర్మపురి లోని నైట్ కళాశాలను కొన్ని నెలల క్రితం పున ప్రారంభించారు.


👉 ఉమ్మడి జిల్లాలో ఒకటే…

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జవహర్ నవోదయ విద్యాసంస్థ చొప్పదండి నియోజకవర్గానికి 1995-96 విద్యా సంవత్సరంలో కేంద్రం మంజూరు చేసింది. 6 వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇందులో ప్రవేశం పొందిన విద్యార్థిని, విద్యార్థులకు భోజన, వసతి, డ్రెస్సులను ప్రభుత్వమే సమకూరుస్తుంది.

జాతీయ, రాష్ట్ర స్థాయి విద్య విధాన బోధన, ఈ సంస్థలో విద్యాబోధనకు ఉపాధ్యాయుల ఎంపిక విధానం జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఈ పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి గ్రామీణ ప్రాంత విద్యార్థులు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు 70 శాతం సీట్ల ను రిజర్వ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిబంధనలను గతంలోనే జారీ చేసింది..


తెలంగాణలో ప్రస్తుతం 9 నవోదయ పాఠశాల కొనసాగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 30 సంవత్సరాల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చొప్పదండి లో ఏర్పాటు చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో జగిత్యాల జిల్లాకు నవోదయ కేటాయించడం పట్ల అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు విద్యావేత్తలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.