J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ని కంటోన్మెంట్ శాసనసభ్యులు గణేష్ సోమవారం దర్శించుకున్నారు.
వీరికి దేవస్థానం పక్షాన సాదరంగా స్వాగతం పలికిన పిదప వేదపండితులు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శేష వస్త్రం చిత్రపటం బహుకరించారు.
👉ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ను కలిసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ !

ధర్మపురి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను సికింద్రాబాద్ కాంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కలిశారు.
👉సర్వే తీరు పరిశీలన !

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా ధర్మపురి పట్టణ కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బోయవాడలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయవలసిందిగా అధికారులకు సూచించారు అదేవిధంగా లబ్ధిదారులు కూడా సర్వేకు వచ్చిన అధికారులకు సహకరించి అధికారులకు పూర్తి వివరాలు అందించాల్సిందిగా కోరారు.
👉షాది ఖానాకు నిధులు మంజూరు చేయండి !

ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన ముస్లిం మైనారిటీ సభ్యులు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి గత ప్రభుత్వంలో బిల్లులు రాక అసంపూర్తిగా ఉన్న షాది ఖానా మరియు కబ్రిస్తాన్ నిర్మాణాలకు సంబంధించిన నిధులు మంజూరు చేయవలసి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని కోరుతూ వినతి పత్రాన్నీ అందజేశారు