ధర్మపురి సొసైటీలో రైతుల సొమ్ము కోల్ల కొడుతున్నారు!

👉 సొసైటీకి ఎకరం భూమి కొనుగోలు లో లక్షలాది రూపాయలు స్వాహ !

👉 సొసైటీ పేరిట 27 గుంటలె రిజిస్ట్రేషన్ !

👉 మిగతా 0.13 గుంటలు ఎవరికి వరమైంది ? ఎవరి పరమైంది ?


J.SURENDER KUMAR,

పగలు రాత్రి , ఎండ వానలో తమ రక్తంను

చెమటగా మార్చి కష్టపడి సంపాదించుకున్న

రైతుల పంట సొమ్ము వాటాదనంగా

ధర్మపురి సింగల్ విండోలో ఉన్న

సొమ్ము కొల్లగొట్టారు, కొల్లగొడుతూనే ఉన్నారు.


👉వివరాల్లోకి వెళితే…

గత టిఆర్ఎస్ ప్రభుత్వం హయం నుంచి ( 2020 – 2024 ) నేటి వరకు ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతున్న ధర్మపురి సింగిల్ విండో లో గత కొంత కాలంగా మూడు పువ్వులు, ఆరు కాయలుగా అవినీతి, అక్రమాలు, నిధులు గోల్మాల్ నిరాటంకంగా కొనసాగుతున్నాయి. కొల్లగొట్టిన రైతుల సొమ్ములు అధికారులు, ఎంతమంది సొసైటీ సభ్యుల పంచుకుంటున్నారో ? అనేది అంతు పట్టని చిదంబర రహస్యం.

👉 వివరాలు ఇలా ఉన్నాయి..

ధర్మపురి సింగిల్ విండో సొసైటీకి ఎకరం భూమి కొనుగోలుకు రికార్డులలో భూమి కొనుగోలు కోసం అంటూ తీర్మానించారు. భూమి కొనుగోలు కు అధికారికంగా లక్షల రూపాయలు డ్రా చేశారు.


రికార్డులలో ఎకరం భూమి కొనుగోలు కోసం అంటూ తీర్మానించి కేవలం 27 (ఇరువది ఏడు) గుంటలే సొసైటీ పేరున పట్టా చేయించుకున్నారు. మిగతా 13 గుంటల భూమి ఎవరికి వరమైందో ? ఎవరు పట్టా చేయించుకున్నా రో ? లక్షలాది రూపాయల సొసైటీ సొమ్ములు ఎవరు ఎంత పంచుకున్నారో ? అనేది మరో గండికోట రహస్యం !

👉 0-27 గుంటలే రిజిస్ట్రేషన్ !

జగిత్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్.

ధర్మపురి మండలం నాగారం గ్రామపంచాయతీ శివారులో సర్వేనెంబర్ 84ఈఈ, లో 0-27 గుంటల భూమి ని పట్టేదారు. ప్రైమరీ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ధర్మపురి పేరును జూలై 6, 2020 రిజిస్టర్ చేశారు. డాక్యుమెంట్ నెంబర్ 4052/2020.. అధికారిక మార్కెట్ ధర ఎకరానికి ₹ 1,50, 000/- ( లక్ష యాబై వేలు ) గా రికార్డులో ఉంది..

ఒక ఎకరానికి ₹ 1,50,000 అధికారిక విలువ.

👉 0-27 గుంటల భూమి కి ₹ 5 ,10, 662/-లక్షలు.!

సొసైటీ అభివృద్ధి కోసం కొనుగోలు చేసిన 0-27 గుంటల భూమికి సొసైటీ ఖాతా నుంచి ₹ 5,10,662/ ( ఐదు లక్షల పదివేల ఆరు వందల అరవై రెండు రూపాయలు ) డ్రా చేసి చెల్లించినట్టు రికార్డులలో నమోదు చేశారు. ఇందులో భూమిపట్టే దారుకు.₹ 4,85,100/-. సబ్ రిజిస్టర్ చాలన్ ద్వారా ₹ 9,062-00/- నాలాకు ( నా అగ్రికల్చర్ ల్యాండ్ ) ₹,10,000/-. సర్వే కోసం.₹ 6,500/- మొత్తం ₹ 5,10,662/- ఖర్చు చేసినట్టు సొసైటీ రికార్డులలో నమోదు చేశారు.

👉 0-13 గుంటల భూమి ఎక్కడ ?

ఎకరం భూమి కొనుగోలు చేసినట్టు రికార్డులలో నమోదు చేసి 0-27 రిజిస్ట్రేషన్ చేయించుకున్న సొసైటీ పాలకవర్గం. 0-13 గుంటల భూమి ఏమైంది ? సొసైటీ పేరును ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు ?

భూమి కొనుగోలుకు సొసైటీ చేసిన తీర్మానం!

పట్టేదారుతో విక్రయ ఒప్పందం చేసుకున్న ఎకరం భూమిలో. 0-27 గుంటలు సొసైటీకి రిజిస్ట్రేషన్ చేయించుకుని మరో 0-13 గుంటల భూమి ఏమైంది ?

ఎవరు పట్టా చేసుకున్నారు ? రికార్డులలో లేని భూమికి సొసైటీకి చెందిన లక్షలాది రూపాయలు ఎవరికి చెల్లించారో ? వేలాదిమంది సభ్యులు గల సొసైటీ రైతాంగానికి చెప్పాల్సిన బాధ్యత పాలకవర్గందే అనే చర్చ మొదలైంది.

👉 రైతులకు న్యాయం జరిగేనా ?

గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అధికారం అడ్డుపెట్టుకొని, సొసైటీలో రైతుల వాటాదనం సొమ్ము ను కొల్లగొట్టిన తీరును అడ్డుకునేది ఎవరు ?

అమాయక రైతాంగాన్ని ఆదుకునేది ఎవరు ? వారి సొమ్ము తిరిగి రాబట్టేందుకు న్యాయం చేసేది ఎవరో ? రైతులు, రైతు సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతుల పక్షాన పోరాడి న్యాయం చేస్తారో ?

ప్రకటనలకే పరిమితమై తమ ఉనికిని కాపాడుకుంటారో ? అమాయక రైతులకు ఎలాంటి ఏం చేస్తారో ? వేచి చూద్దాం.