ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు !

J.SURENDER KUMAR,


శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానములో ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి, అనుబంధ ఆలయాల్లో గల స్వామి వార్లకు పంచోపనిషత్లతో అభిషేకం, హారతి మంత్రపుష్పం, కార్యక్రమంలు అత్యంత వైభవంగా నిర్వహించారు.

పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని అలాగే అనుబంధ దేవాలయములలో గల స్వామి వార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.


👉ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం !

పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు  సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు.

కావున ఈ మాసానికి సౌర మానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
తాను అన్ని మాసాల్లో ఉత్తమమైన మార్గశిర మాసం లాంటివాడినని శ్రీమహావిష్ణువు స్వయంగా చెప్పిన‌ట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది, ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు.


ఈ మాసంలో భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమాలు సాధారణంగా చేయరు. పూర్తిగా దైవం పైనే శ్రద్ధ వహించి ప్రార్థించాలన్నదే ఇందులో అంతరార్థం.

👉ధనుర్మాస పూజ వెయ్యేళ్ల ఫలం

కలియుగంలో శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ధనుర్మాసంలో ఒకరోజు పూజించినా వెయ్యేళ్ల పూజాఫలం దక్కుతుంది.

పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ భక్తులు ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో ధనుర్మాస పూజలు చేస్తారు.