👉దత్తాత్రేయ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు !
J.SURENDER KUMAR,
గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో దత్త నవరాత్రుల సందర్భంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, శైలజ రామయ్య దంపతులు. ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.

స్వామివారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలు పండ్లరసాలతో అర్చకుల వేదమంత్రాలు మధ్య అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారి మూలవిరాట్ కు విశేష ఉపచార పూజలు నిర్వహించి దూపదీప నైవేద్యాలను సమర్పించారు.

దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష్మీ గణపతి దత్త హోమంలో మంత్రి దంపతులు పాల్గొన్నారు.
అనంతరం ఆలయ అర్చకులు మంత్రి దంపతులకు తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దేవాలయానికి విచ్చేసి దత్తుని సేవలో తరించారు.

అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరు పై చూపాలని వేడుకున్నట్లు తెలిపారు.