దత్తాత్రేయక్షేత్రం వరదవెల్లి కి పోటెత్తిన భక్తజనం !

👉 దత్త జయంతి ఉత్సవాల నేపథ్యంలో..

👉 దత్తాత్రేయుడు సర్పరూపంలో శయన ముద్రలో కొలువైన అరుదైన క్షేత్రం !

👉 వరదవెల్లి రాహు క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది !


J.SURENDER KUMAR,


వరదవెల్లి దత్త  క్షేత్రానికి ఆదివారం భక్తజనం పోటెత్తారు. శ్రీ దత్త జయంతి ఉత్సవాలు నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి భక్తజనం ఆదివారం తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనంకు పడవలో ప్రయాణించి దర్శించుకుంటున్నారు.

వరదవెల్లి రాహురూప (సర్పరూప) శయన ప్రపంచం లోనే అతి అరుదైన, వింతైన ఈ వరదవెల్లి రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడిని దర్శించుకుంటున్నారు.
ప్రకృతి రమణీయ అందాలతో, ఎత్తైన కొండమీద వెలసిన ఈ క్షేత్రం చూసి తీరవలసినదే. దత్త కృప ఉంటేనే అది సాధ్యం. వర్షాకాలం ప్రారంభమైతే ఈ క్షేత్రానికి వెళ్లే త్రోవ నీళ్లతో నిండిపోతుంది

👉వరదవెల్లి గ్రామం ప్రత్యేకత ఏంటి?

అత్యంత అరుదైన రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడు ఉండడం ఈ గ్రామ ప్రత్యేకత. ఇటు వంటి క్షేత్రం ప్రపంచంలో మరెక్కడాలేదు. ఈ దత్తక్షేత్రం ప్రాంగణం లోనే దత్తాత్రేయుడు వేంకటేశ్వర స్వామి రూపంలో ‘దత్త వేంకటేశ్వర స్వామి’ గా కుడా వెలిశారు. దత్త వేంకటేశ్వర స్వామి గుడి కుడా ప్రపంచంలో ఇదొక్కటే.


వరదవెల్లి గ్రామం ‘తెలంగాణ’లోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల బోయినపల్లి మండలంలో కరీంనగర్ వేములవాడ రోడ్ లోని కొదురుపాక స్టేజి వద్ద ఉంటుంది. వరదవెల్లి గ్రామం మిడ్_మానేరు జలాశయం క్రింద రావడం వల్ల గ్రామం మొత్తం దాదాపుగా నిర్వాసిత గ్రామమే.

పూర్వం నుండి తరచుగా ఈ గ్రామం ముంపుకు, వరదలకు గురౌతుండడం, శ్రీరాం సాగర్ వరద కాల్వ ఈ గ్రామం గుండా వెళుతుండడం వల్ల ‘వరదవెల్లి’ అని పేరు వచ్చిందని కొంత మంది గ్రామస్తుల అభిప్రాయం. అయితే గురు దత్తాత్రేయుల వారు ‘వరద హస్తములతో’ ఇక్కడ వెలియడం వల్ల ‘వరదవెల్లి’ అనే పేరొచ్చిందన్నది చారిత్రాత్మక కథనం.

👉వరదవెల్లి రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయ స్థలపురాణం

దాదాపు 900 సంవత్సరాల క్రితం దేశాటన లో భాగంగా శ్రీ వేంకటాచార్యులు అనే ఒక కుర్ర వైష్ణవ అవధూత (ఈయన నే వెంకా వధూత అనే వారు) వేములవాడ కు వచ్చి అక్కడనుండి వరదవెల్లి కి వచ్చి అక్కడ గల గుట్ట మీద శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రంహం కోసం 12 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేసారు.

వెంకావధూత వేంకటేశ్వర స్వామి వారి భక్తుడే కాకుండా శ్రీ గురు దత్తాత్రేయుల వారి భక్తుడు కుడా. వారి తపస్సుకు మెచ్చిన వేంకటేశ్వర స్వామి వెంకావధూత కోరిక మేరకు ‘దత్త వెంకటేశ్వర స్వామిగా’ దర్శనమిచ్చారు.

దత్త వెంకటేశ్వర స్వామి దర్శనంతో పులకించి పోయిన వెంకావధూత తదుపరి కుడా అక్కడే ఉండి శ్రీ గురు దత్తాత్రేయు ల వారి కోసం ఘోర తపస్సు చేసారు. ఆవిధంగా 28 సంవత్సరాలు దత్త దర్శనం కోసం నిరంతరం తపించారు. ఆఖరికి ఒకానొక గురువారం ఉదయం సూర్యోదయ సమయంలో శ్రీ దత్తాత్రేయుల వారు ఏఖ ముఖుడిగా ప్రత్యక్షమై వెంకావధూత భక్తి శ్రద్ధలకు మెచ్చి ఏంకావాలో కోరుకోమన్నారు.


వెంకావధూత: గురుదేవా శరణం శరణం.. ధన్యుడను.
అంతట శ్రీ దత్తాత్రేయుల వారు రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడు గా మారి వెంకావధూత ఖర్మలను త్వరగా అనుభవించేట్టుగా చేసి వెంకావధూతను వారిలోకి ఐక్యం చేసుకుంటారు. ఆ విధంగా కేవలం భక్తులను ఉద్ధరించడానికి మరో రూపం లోకి మారి అత్యంత అరుదైన రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడు – వరదవెల్లి దత్తాత్రేయుడు గా యేర్పడ్డాడు. ముందు చెప్పుకున్నట్లుగా రూపమే లేని గురు దత్తాత్రేయుడు ఇక్కడ చిత్రంగా ఉండి పూజలు అందుకుంటున్నారు.


ప్రపంచం లోనే అతి అరుదైన, వింతైన ఈ వరదవెల్లి రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడిని అందరూ దత్త భక్తులు దర్శించుకోవచ్చు.

👉భక్తజనం కు నమ్మకం విశ్వాసం

1. తొందరగా తెమలని కోర్ట్ కేసులు ఉన్నవారు

2. వయసు పెరిగినా ఉద్యోగంలో సెటిల్ అవ్వనివారు

3. రాహు మహర్దశలో ఉన్నవారు

4. భర్త ఒక చోట ఉద్యోగంలో భార్య,పిల్లలు మరొక చోట ఉన్నవారు లేదా భార్య ఒక చోట ఉద్యోగంలో భర్త,పిల్లలు మరొక చోట ఉన్నవారు

5. ఉద్యోగ బదిలీలు కావాలనుకునేవారు

6. ఆఫీస్ పాలిటిక్స్ లో పైచేయి/విజయం సాధించాలనుకునే వారు

7. దొంగతనం మొదలైన అభాండాలు మీదపడ్డవారు

8. తరచుగా అబార్షన్లు/సంతన నష్టం కలిగిన
వారు


👉 ఆశ్చర్యపరిచే ప్రత్యక్ష నిదర్శనాలు
దత్తాత్రేయుడు పడుకుని రాహు రూపంలో ఉండడం

1. దత్తత్రేయునికి ప్రతీకగా నేటికి ఉన్న వందల ఏళ్ళనాటి నింబవృక్షాలు

2. వరదవెల్లి రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడిని ఫోటో తీసినప్పుడు విగ్రహం లో దాగిఉన్న జంట సర్పాల ఆనవాళ్ళు కనిపించడం

3. దత్తాత్రేయుడు వెంకటేశ్వర స్వామి రూపంలో ‘దత్త వెంకటేశ్వరస్వామి’ గా పిలవబడడం

4 క్షేత్రానికి 3 వైపులా నీరు ఉంటుంది.

రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు ఏప్రిల్ మే మాసంలో భారీగా ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు.