👉బీర్పూర్ దొంగతనం కేసులో పోలీసుల పురోగతి ?
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున వ్యాపారిని తాళ్లతో చేతులు, కాళ్లు కట్టి కొట్టి దొంగతనం చేసిన గుర్తు తెలియని వ్యక్తుల కదలికల సమాచారం పోలీసులు ఛేదించినట్టు సమాచారం.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగిత్యాల జిల్లా ఎస్పి అశోక్ కుమార్. ప్రత్యేక బృందాలతో. దొంగల ఆచూకీ కోసం ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో కొందరు అనుమానితులపై నిఘా పెట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సిసి కెమెరా ఫుటేజ్ లు నిశితంగా పరిశీలించి వందలాది మంది అనుమానితుల ఫోన్ కాల్ డాటాను విశ్లేషించి కచ్చితంగా సెలెక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతిలో విచారణ చేపట్టినట్టు తెలిసింది.
అనుమానితుల కదలికలను మఫ్టీలో కొందరు పోలీసులు గుర్తించి పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు తెలిసింది.
దొంగలించిన సొత్తు తో సహా వారిని అదుపులోకి తీసుకోవడానికి పోలీస్ శాఖ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
👉ఛాలెంజ్ గా కేసు దర్యాప్తు..
పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో దొంగతనం జరగడంతో పోలీస్ శాఖ ఈ సంఘటనను చాలెంజిగా స్వీకరించి విచారణ ప్రారంభించింది.
నడిరోడ్డుపై ఉన్న వ్యాపారి ఇంటి ప్రహరీ గోడ లోపల గల బాత్ రూమ్ లో నలుగురు మాస్కులు ధరించిన వ్యక్తులు దాడి చేసి దోచుకున్న విషయం తెలిసిందే.