👉ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు సైతం ?
J.SURENDER KUMAR,
ములుగు జిల్లా ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టులు హతమైనట్టు సమాచారం.
గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్టు స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. అధికారిక ప్రకటన వెలువడ లేదు. మరణించిన వారిలో మావోయిస్టు కీలక నాయకులు ఉన్నారు అని సమాచారం.
యెల్లందు- నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు అనే పాపన్న సైతం హతమైనట్టు సమాచారం .
ఎన్‌కౌంటర్‌లో హతమైన వారిలో కుర్సం మంగు అలియాస్ బద్రు , అగోళపు మల్లయ్య ముస్సాకి దేవల్ , ముస్సాకి జమున , జైసింగ్ , కిషోర్ కమేష్ ఉన్నట్టు సమాచారం.