J.SURENDER KUMAR,
గత ప్రభుత్వంలో గురుకులాలను నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల సంక్షేమం పట్టించుకోలేదని, మా ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని హాస్టల్లో కి , కనీసం ప్రాంగణంలో కి అనుమతించలేదని , ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,బిసి మైనార్టీ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ప్రభుత్వం డైట్ మరియు కాస్మొటిక్ చార్జీలను పెంచిన సందర్భంగా ధర్మపురి పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపులే డిగ్రీ కళాశాల, మరియు మైనార్టీ పాఠశాల, ధర్మపురి మండలంలోని మగ్గిడి సోషల్ వెల్ఫేర్ శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో డైట్ మరియు కాస్మొటిక్ చార్జీలను పెంచినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి భట్టికి, సంబంధిత శాఖ మంత్రికు ధన్యవాదాలు తెలుపుతున్నామనీ, అన్నారు.
పెంచిన డైట్ చార్జ్ వివరాలను ఎమ్మెల్యే ప్రకటించారు.
3 వ తరగతి నుండి 7 వ తరగతి వరకు నెలకు ₹ 950 గా ఉన్న డైట్ చార్జీలను ₹1330 లు.
8 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు నెలకు ₹1100 గా డైట్ చార్జీలను ₹1540 గా
ఇంటర్ నుండి పిజి వరకు ₹1500 గా ఉన్న డైట్ చార్జీలను ₹ 2100 గా పెంచడం జరిగిందని,
అదే విధంగా కాస్మొటిక్ చార్జీలను కూడా భారీగా పెంచడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంలో వారి కాస్మొటిక్ మరియు డైట్ చార్జీలను పెంచిన సంధర్భంగా ఈ రోజు విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, ఎమ్మెల్యే అన్నారు.

పాఠశాలలకు సంబంధించి కొన్ని సమస్యలను నా దృష్టికి తీసుకురావడం జరిగిందని,వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని, విద్యార్థులకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న నా దృష్టికి తీసుకురావాలనీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా విధ్యాధికారులు, మరియు మండల నాయకులు పాల్గొన్నారు.