J.SURENDER KUMAR,
త్వరలో జరగనున్న (2027లో) గోదావరి నది పుష్కరాలను వేద శాస్త్ర పండితులు, అర్చకుల సలహాలు సూచనల మేరకు ధర్మపురి క్షేత్రంలో నా భూతో నా భవిష్యత్తు అనే తరహాలో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
అన్నారు.

పవిత్ర కార్తీక మాసం చివరి రోజు సంధర్బంగా ధర్మపురి క్షేత్రంలోని గోదావరి నది వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన మహ హారతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గోన్నారు.

ఈ సందర్భంగా గోదావరి వద్ద వేద పండితులు నిర్వహించిన పూజాధి కార్యక్రమల్లో పాల్గొని భక్తజనంతో కలిసి గోదావరి నదికి హారతి ఇచ్చారు.
ఈ సందర్భంగా మహిళలకు కార్తీక మాసం సందర్భంగా ప్రభుత్వం నుండి వచ్చిన సుమంగళి కానుకలు మహిళలకు పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.

.పవిత్ర కార్తీక మాస చివరి ఈ రోజు ధర్మపురి పుణ్య క్షేత్రంలో నిర్వహించే మహా హారతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గత నెల రోజుల నుండి కార్తీక మాసం సందర్భంగా ధర్మపురి గోదావరి నదికి హారతి కార్యక్రమన్ని వైభవోపేతంగా నిర్వహించడం జరిగిందని,

ఈ ప్రాంత ప్రజల పై గోదావరి నది ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కృప కటాక్షాలు రాష్ట్ర ప్రజానీకం పైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు, ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో భక్తజనం దేవాలయ అధికారులు, అర్చకులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.