👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి పవిత్ర గోదావరి నదిలో కలుస్తున్న మురుగునీటి నివారణకు మురుగునీటి శుద్ధి కర్మాగార (STP) నిర్మాణానికి పరిపాలన అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కలసి ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ వినతి పత్రం ఇచ్చారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శనివారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో ఆయన చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి ఆవశ్యకత ను వివరించారు.
👉ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
ధర్మపురి పట్టణంలో మురుగు నీటి శుద్ధి కర్మాగారం (STP) అందుబాటులో లేకపోవడంతో మురికి నీటి కాలువలనుండి నుండి డ్రైనేజీ నీరు నేరుగా పవిత్ర గోదావరి నదిలోకి చేరి పుష్కర ఘాట్‌ల ద్వారా నదిలోకి ప్రవహించి కలుషితమై దుర్వాసన రావడం జరుగుతుందని, సీఎంకు వివరించామన్నారు.
గోదావరి నది జరాల కలుషితం వల్ల ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రానికి వచ్చే యాత్రికులకు చాలా అసౌకర్యం కలుగుతుందని, ఎమ్మెల్యే వివరించారు. ఈ నేపథ్యం లోSTP నిర్మాణానికి ₹ 17 కోట్ల రూపాయల మంజూరుకు పరిపాలన అనుమతులు ఇవ్వాలని, అదే విధంగా వేములవాడ , కొండగట్టు , ధర్మపురి , కోటిలింగాల పుణ్య క్షేత్రాలను కలుపుతూ టూరిజం కారిడార్ ను ఏర్పాటు చేయాలని విన్నవించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తమ అభ్యర్థన వినతుల పట్ల సానుకూలంగా స్పందించారని అన్నారు.