👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
గ్రామీణ స్థాయి విద్యార్థిని విద్యార్థులలో ఉన్న క్రీడా ప్రతిభ నైపుణ్యాలను వెలికితీసి ప్రపంచ స్థాయి క్రీడాకారుల గా తీర్చిదిద్దేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీల నిర్వహణ లక్ష్యమని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిఎం కప్ లో భాగంగా ధర్మపురి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడ పోటీలను మంగళవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని క్రీడలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం ఎమ్మెల్యే కు ఘనంగా స్వాగతించారు.
క్రీడలు పోటీలు జరిగే మూడు రోజుల పాటు విద్యార్థులకు భోజనాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.
ధర్మపురి లో ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సీఎం కప్ పోటీలను ప్రారంభించాడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం క్రీడల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం చూపిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టామన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా పిఈటీ లుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని పిడీలుగా అప్ గ్రేడ్ చేశామని, త్వరలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో శిధిలావస్థలో ఉన్న పురాతన భవనాన్ని తొలగిస్తామని, ఇటీవల మంజూరైన ఇంటిగ్రేటెడ్ కళాశాల భవనంతోపాటు, ఐటీఐ కళాశాల భవనానికి మంత్రి శ్రీధర్ బాబుతో కలసి త్వరలో భూమి పూజ చేస్తామని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.

నియోజకవర్గంలో విద్యార్తుల క్రీడలు, మరియు విద్యకు సంబంధించిన విషయంలో ఏ దశలోనూ రాజీ పడే ప్రసక్తి లేదని, క్రీడాకారులకు బోజన సదుపాయం అవసరం ఉంటే నా దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఉపాధ్యాయులను కోరారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు