👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పిల్లల చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చును తెలంగాణను పునర్నిర్మాణంలో వారిని భాగస్వాములుగా, భవిష్యత్తు తరాలను నిర్మించడానికి పెడుతున్న పెట్టుబడిగా మాత్రమే చూడాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.
👉 చేవెళ్ల నియోజకవర్గం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామన్ డైట్‌ను సీఎంగారు ఆవిష్కరించారు. పలువురు విద్యార్థులతో మాట్లాడించారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధికారులతో కలిసి అక్కడే భోజనం చేశారు.
👉 అంతకముందు సీఎం కార్యక్రమంలో మాట్లాడుతూ, సాంఘిక సంక్షేమ పాఠశాలల ప్రమాణాలను పెంచాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు.
👉 ప్రైవేటు విద్యా సంస్థలతో పోల్చితే ప్రభుత్వ విద్యాలయాల్లో క్వాలిఫైడ్ టీచర్లు, మంచి వసతులు, మంచి జీతాలు ఉన్నా, ఎందుకు ప్రమాణాలు పెంచడం లేదు అనే ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఉందన్నారు.
👉 రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23 లక్షల మంది చదువుతుంటే, 11 వేల ప్రైవేటు పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.
👉 ప్రైవేటు పాఠశాలల్లో టాలెంట్ ఎక్కువగా ఉంటుందని, ప్రభుత్వ స్కూళ్లలో తక్కువగా ఉంటదన్న అపోహను తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ స్కూళ్లల్లో చదువుతున్న వారు అనాదలు కాదు. వాళ్లు రాష్ట్ర సంపద అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
👉 8 ఏళ్ళ నుంచి డైట్ చార్జీలను పెంచలేదు. 16 ఏండ్లుగా కాస్మొటిక్ చార్జీలను పెంచలేదు. ప్రజా ప్రభుత్వం అన్నీ పరిశీలించి 40 శాతం మేరకు డైట్ చార్జీలను 212 శాతం కాస్మొటిక్ చార్జీలను పెంచాం.

👉 గతంలో ఆరు నెల్లకో సంవత్సరానికో ఒకసారి నిధులు విడుదల చేసే వారు. ఇప్పుడు ప్రతి నెలా 10 వ తేదీలోగా గ్రీన్ చానెల్ ద్వారా నిధులు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నాం
.👉 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ దశ, దిశను మార్చడానికి, తెలంగాణ పునర్నిర్మాణంలో వారిని భాగస్వామ్యం చేయాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది.
👉 భవిష్యత్తులో కూడా రెసిడెన్షియల్ స్కూళ్లను పరిశీలిస్తా. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు.
👉 విద్యార్థులతో మెస్ మేనేజ్‌మెంట్ కమిటీలు ఏర్పాటు చేసి వారిని భాగస్వాములను చేయడం ద్వారా వారికి అవసరమైన ఆహారాన్ని వారే ఎంపిక చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
👉 ప్రతిసారీ విద్యా సంవత్సరం ప్రారంభంలో ఏదో ఒక సమస్య రాకుండా ముందుగానే పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం.
👉 స్కూల్ యూనిఫామ్ బాధ్యతను రాష్ట్రంలోని మహిళా సంఘాలకు అప్పగించాం. కుట్టు పనికి ఇచ్చే రుసుమును కూడా రూ.25 నుంచి రూ.75 కు పెంచాం. స్కూళ్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాం.
👉 వారంలో రెండు మూడు రోజులు రెసిడెన్షియల్ స్కూళ్లను సందర్శించాలని ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించామని చెప్పారు.
👉 ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి , స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య , కలెక్టర్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.