👉సంతోష్ ట్రోఫీ పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
ఈనెల 14 నుండి హైదరాబాద్ నగరంలో సంతోష్ ట్రోఫీ ఫుట్ బాల్ క్రీడల పోటీ ప్రారంభం కానున్నాయి.
ఈ మేరకు పురస్కరించుకుని రూపొందించిన పోస్టర్ ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలోని తన నివాసంలో గురువారం ఆవిష్కరించారు.
57 సంవత్సరాల తర్వాత ఫుట్ బాల్ క్రీడలో ప్రతిష్టాత్మక టోర్నీ సంతోష్ ట్రోఫీకి హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వడం సంతోషకరమైన విషయమని ముఖ్యమంత్రి అన్నారు.
తెలంగాణ ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ , మల్లు రవి, సురేష్ షేట్కర్ , పొరిక బలరాం నాయక్ , చామల కిరణ్ కుమార్ రెడ్డి , గడ్డం వంశీ , రామసహాయం రఘురామిరెడ్డి , న్యూఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. డిసెంబర్ 14 నుండి 31 వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 37 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.