👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులతో..
J.SURENDER KUMAR,
హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో అడుగులు వేస్తున్న ప్రజా ప్రభుత్వం అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ₹ 5,827 కోట్లతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ ప్రారంభోత్సవాలు చేశారు.
👉 Hyderabada Rising ఉత్సవంలో భాగంగా నెక్లెస్ రోడ్డు HMDA మైదానంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆయా అభివృద్ధి ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు.
👉 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో H-CITI ఫేజ్-1 లో ఇప్పటికే పరిపాలనా అనుమతులను మంజూరు చేసిన ₹ 3446 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
👉 నగరంలో రహదారులు, వివిధ జంక్షన్ల సుందరీకరణకు ₹ 150 కోట్లతో వివిధ పనులకు శంకుస్థాపన చేశారు.
👉 నగరంలో వరదనీరు నిలవకుండా వర్షపు నీటి సంరక్షణ, వరద నీటిని నియంత్రించే పనులకు ₹ 17 కోట్ల అంచనాలతో చేపట్టే పనుల ప్రారంభించారు.
👉 ₹ 669 కోట్ల అంచనాలతో హైదరాబాద్ జల మండలి (HMWSSB) అధ్వర్యంలో నిర్మించిన మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు) ప్రారంభించారు.
👉 తాగునీటి సరఫరాకు అవుటర్ రింగ్ రోడ్డు ORR చుట్టూ వివిధ ప్రాంతాల్లో ₹ 45 కోట్లతో చేపట్టిన 19 రిజర్వాయర్లను ప్రారంభించారు.
👉 హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HRDCL) అధ్వర్యంలో గ్రేటర్ సిటీలో ₹ 1500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే ప్యాకేజీతో పాటు గతంలో పెండింగ్‌లో ఉన్న పనులకు శంకుస్థాపన చేశారు.
👉 అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంతో కొత్త ఆన్‌లైన్‌లో బిల్డింగ్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్‌వేర్‌ను సీఎంగారు లాంఛనంగా ప్రారంభించారు. 2025 ఫిబ్రవరి నుంచి ఈ విధానం అమలులోకి రానుంది.