జైన లో ఉచిత మెగా వైద్య శిబిర నిర్వహణ !

J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం లోని జైన గ్రామంలో గల స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ యందు ఆది వారం రోజు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కరీంనగర్ వన్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో.. జైన గ్రామ మాజీ ఉప సర్పంచ్ కోరుట్ల శ్రీనివాస్ సహాయ సహకారం లతో జైన, కోసునూర్ పల్లె ఉమ్మడి గ్రామాల గ్రామ ప్రజల కోసం మెగా వైద్య శిబిరం నిర్వహించారు.

కార్యక్రమ అనంతరం గ్రామ ప్రజలకు వన్ హాస్పిటల్స్ వైద్య సిబ్బంది సీజనల్ వ్యాధుల పైన అవగాహనా కల్పించారు. ఉచిత వైద్య శిబిరం నందు వన్ హాస్పిటల్స్ సీనియర్ వైద్యులు డాక్టర్ మహ్మద్ మునవార్ లతో పాటు, డాక్టర్ చెన్నా భావ్య సిబ్బంది పాల్గొన్నారు.


వందలాది మంది ఉచిత వైద్య పరీక్షల సేవలు పొందారు. దాదాపు లక్ష రూపాయల విలువ కలిగిన మందులను శిబిరంలో ఉచితంగా పంపిణీ చేశారు.


వైద్య సిబ్బంది కీ నిర్వహకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు, వన్ హాస్పిటల్స్ మేనేజర్ క్యాంపు ఇంచార్జ్ వెల్మా రెడ్డి సంతోష్ రెడ్డి లతో పాటు, వైద్య సిబ్బంది సామ్రాట్, సతీష్, సాయి, శ్రీనివాస్, సంబెటా తిరుపతి యాదవ్, గడ్డి రాజన్న, గుడ్ల విజయ్ కుమార్, సుంకు మధు సూదన్, కూడిక్యాల మహేష్, కట్ట భువనేశ్వర్, కోరుట్ల రాజ శేఖర్, సంగెపు మల్లయ్య, మూల మోహన్ రెడ్డి, చిన్నా గంగా రెడ్డి, అక్షయ్, శివ రామ కృష్ణ, పెద్ద గంగా రెడ్డి, మహేందర్, గ్రామ ప్రజలు, మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, యూత్ సభ్యులు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు
.