జిల్లాలో క్రాప్ బుకింగ్ నమోదు చేయాలి కలెక్టర్ సత్యప్రసాద్ !

J.SURENDER KUMAR,


శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ జిల్లా అగ్రికల్చర్ ఏవోలు ,డి సి ఓ లు , హార్టికల్చర్, అధికారులతో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు.


అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో క్లస్టర్ వారిగా ఆయిల్ ఫామ్ సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వానకాలం సీజన్ క్రాప్ బుకింగ్ మండలాల వారిగా నమోదు వివరాలను తెలుసుకొని పూర్తిస్థాయిలో జిల్లాలో క్రాప్ బుకింగ్ నమోదు చేయాలని తెలిపారు.


జిల్లాలో పెండింగ్లో ఉన్న ఈ కేవైసీ కానీ 2600 మంది రైతులకు కచ్చితంగా వారి వివరాలను నమోదు చేయాలని అన్నారు. అలాగే రైతుల యొక్క ఆధార్ కార్డు లింక్ కూడా పూర్తి చేయాలి అని తెలిపారు.


జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ ప్రకారం ఆయిల్ ఫామ్ సాగును క్లస్టర్ల వారిగా రైతులను మోటివేట్ చేస్తూ రైతులతో ఆయిల్ ఫామ్ సాగు విధానంపై అవగాహన కల్పిస్తూ క్లస్టర్ల వారిగా ఆయిల్ ఫామ్ సాగుని పెంపొందించాలని అధికారులకు ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో, అగ్రికల్చర్ ఏవోలు, డి సి ఓ లు, హార్టికల్చర్, అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.