👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సదుపాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించడం తో ఈ స్కీమ్ ద్వారా జిల్లాకు సుమారు ₹ 200 కోట్లకు పైగా ఆర్టీసీకి ఆదాయం రావడం జరిగిందని, ధర్మపురి ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రం బస్ డిపో లో గురువారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆర్టీసీ అధికారులతో కలిసి పాల్గొన్నారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవల కార్యక్రమంలో నన్ను భాగస్వాములను చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
అదే విధంగా కొన్ని రూట్ల విషయంలో బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అట్టి విషయాన్ని కూడా సంబంధిత మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, త్వరలోనే కొత్త బస్సులు కొనుగోలు చేయడం ద్వారా అట్టి బస్సు కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.