👉 ప్రజా పాలన ప్రజ విజయోత్సవాల లో..
👉 జగిత్యాల్ కలెక్టర్ బి సత్యప్రసాద్ !
J.SURENDER KUMAR,
జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా సంవత్సర కాలంలో 4.2 కోట్ల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ లో ప్రయాణించారని ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు ₹ 109,19 కోట్లు చెల్లించిందని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు.
ధర్మపురి పట్టణంలో నిర్వహించిన ,ప్రజా పాలన ప్రజ విజయోత్సవాలు కార్యక్రమంలో ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొన్నారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజ పాలన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది. దానిలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు .
ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ లు భాగంగా జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళకు బస్ టికెట్లు 4,2 కోట్లు మంది ప్రయాణికులకు ₹ 109,19 కోట్లు చెల్లింపు చేశామని కలెక్టర్ తెలిపారు
.👉 ₹18 కోట్లు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలో ఆరోగ్యశ్రీ పేషెంట్ల 18,652 మందికి ₹42,28 కోట్లు వరకు లబ్ధి చేకూరిందని.

👉గృహ జ్యోతి పథకం ద్వారా 2,02,801 కోట్లు మందికి ₹ 55,25,29 కోట్లు చెల్లింపు చేశామని.
👉రుణమాఫీ 80, వేల 515 మంది మంది రైతులకు ₹ 72,1,74 కోట్లు రైతులకు లబ్ధి చేకూరిందని తెలిపారు.
👉 వరి ధాన్యం సన్నపు రైతు కొనుగోలుకు బోనస్ 227, మంది రైతులకు ₹ 1,41 కోట్ల బోనస్ అందజేశామని తెలిపారు.

👉 రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్లు యాప్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించింది అన్నారు.
👉రేపటి నుండి ప్రతి ఇంటికి సర్వే చేస్తారు అని తెలిపారు.రాష్ట్రంలో 119 నియోజకవర్గాల సంక్రాంతి 15 లోపు సర్వే పూర్తి చేసి. నిరుపేదలైన లబ్ధిదారులకు గుర్తించి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని తెలిపారు
👉అనంతరం విప్ అడ్డ్లూరి లక్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలో కచ్చితంగా అమలు చేస్తామని ఇప్పటికే జిల్లాలో మహాలక్ష్మి, గృహ జ్యోతి, 500 వందలకే గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఉచిత బస్ ప్రయాణం చేస్తున్నారే ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారికి నిధులు చెల్లింపులు చేస్తున్నామని. అలాగే జిల్లాలో ఏకకాలంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ పూర్తి చేసిందని తెలియజేశారు.

ప్రస్తుత వర్షాకాలం పంటలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి ఇప్పటికప్పుడు రైస్ మిల్లులతో సమావేశం ఏర్పాటు చేస్తూ క్షేత్రస్థాయిలో కలెక్టర్ తిరుగుతూ విజయవంతంగా పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
👉అనంతరం 41, వ పట్టణ మహిళా పొదుపు సంఘాలకు బ్యాంకు లీకేజీ క్రింద ₹ 5,63,50,000 కోట్లు చెక్కును అందజేశారు.
👉ఇందిరా మహిళ శక్తి మూడు గ్రూపులకు గాను 16 మంది లబ్ధిదారులకు వ్యక్తిగత రుణాలు ₹ 68,00,000, లక్షల చెక్కును అందజేశారు.
👉పట్టణ వీధి వ్యాపారులకు ₹ 2,36,0000, లక్షల చెక్కును అందజేశారు.
👉అలాగే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
👉అలాగే యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 2 ఫేస్ లో భాగంగా జగిత్యాల మరియు ధర్మపురికి ప్రభుత్వం కేటాయించిందని.
👉ఐటిఐ కాలేజీ ధర్మపురిలో ఏర్పాటు కానుందిని తెలిపారు. అలాగే నూతనంగా జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు కాబడిన నవోదయ స్కూల్స్ కేటాయించబడిందని తెలిపారు.
👉అనంతరం బడి పిల్లలకు స్కూలు యూనిఫామ్స్ అందజేశారు. అలాగే మున్సిపల్ కార్మికులకు నిత్యవసర వస్తువులు మరియు ఉత్తమ సేవ చేసిన కార్మికులకు ప్రశంస పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో, అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, జగిత్యాల ఆర్డీవో, మధు సుదన్, మున్సిపల్ చైర్మన్, సంగి సత్తమ్మ, ఎమ్మార్వో, కృష్ణ చైతన్య,.ఎంపీడీవో, ఎంపిఓ, మున్సిపల్ కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.