👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటనీ, దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి మన్మోహన్ ఆని
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ధర్మపురి పట్టణంలోని స్థానిక నంది విగ్రహం వద్ద శుక్రవారం రోజున మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
శుక్రవారం ధర్మపురి పట్టణంలో మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి ఆయన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనత వారికే దక్కుతుందని, ఎటువంటి వివాదాలు లేకుండా 10 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసి వివాదా రహితుడగా గుర్తింపు పొందారని, అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాట కూడా శ్రీమతి సోనియా గాంధీ ,మరియు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యంలోనే సాధ్యం కావడం జరిగిందనీ, కేంద్ర మంత్రిగా ఆయన చేసిన సేవలు దేశం ఎన్నటికీ మార్చిపోదని, సోనియా గాంధీ కి ప్రధానిగా అవకాశం వచ్చినప్పటికి మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణల దృష్ట్యా ప్రధాని పదవిని వారికి ఇవ్వడం జరిగిందని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నట్లు ఈ సంధర్బంగా తెలిపారు..
వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు