మల్లన్న స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !


J.SURENDER KUMAR,

ఉత్తర తెలంగాణ జిల్లాల గ్రామీణ ప్రజల ఇష్టదైవం ఇలవేల్పు దొంగ మల్లన్న స్వామిని ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.


గొల్లపెల్లి మండలం మల్లన్న పేట గ్రామంలో జరుగుతున్న దొంగ మల్లన్న స్వామి వారి జాతర ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దర్శించుకొని దేవాలయంలో తులా భారంలో పాల్గొని నిలువెత్తు బంగారాన్ని సమర్పించి, ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..


👉వివాహ మహోత్సవాలలో..


ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆదివారం జరిగిన పలు వివాహ మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు


రాయికల్ మండల కేంద్రంలోని R R గార్డెన్ లో మూటపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మండ జల రమేష్ కూతురు రుచిత , మహేష్ కుమార్


జగిత్యాల లో విరుపాక్షి గార్డెన్ లో సాయి మేఘన రెడ్డి, సాయి చరణ్ రెడ్డి


గొల్లపల్లి మండలం గోవిందు పల్లె లో వెంకటేశ్వర గార్డెన్ లో శ్రీలేఖ, రాజు యాదవ్ ధర్మపురి పట్టణంలోని పటేల్ గార్డెన్ లో కావ్యశ్రీ, వినోద్ కుమార్,

ఎండపెల్లి మండలం రాజారాం పల్లె లో SR గార్డెన్ లో లాస్య ,అనంత చారి వివాహా మహోత్సవాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.