మన ప్రజా పాలన ప్రభుత్వ సభను విజయవంతం చేయండి !

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ఈ నెల 4 న పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో మన ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వ యువ వికాస్ పేరుతో నిర్వహించే ఉత్సవ బహిరంగ సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గ ప్రజలు తరలిరావాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.


ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో సభ వివరాల గూర్చి వివరించారు.
సమావేశంలో ఎమ్మెల్యే వివరించిన ప్రధాన అంశాలు..


👉 ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమం గూర్చి సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి 50 వేల ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది, ,₹ 2 లక్షల లోపు ఉన్న రుణాలను కూడా మాఫీ చేయడం జరిగింది.


👉 రైతు రుణమాఫీ కింద దాదాపు ₹ 20 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. చివరి రైతు వరకు రుణమాఫీని చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది.


👉 గత ప్రభుత్వ పాలకులు రైతుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు, రైతులే నేరుగా మిల్లర్లతో మాట్లాడుకొని వడ్లను అమ్ముకునే పరిస్థితి నాడు ఉండేది.


👉 ఎక్కడైనా రైతులు వచ్చి వడ్ల కొనుగోలు విషయంలో ఇబ్బంది ఉందని పత్రిక ముఖంగా వివరించిన దాఖలాలు లేవు, ప్రతి సెంటర్ వద్ద ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించి వడ్లను కొనుగోలు చేయించడం జరిగింది. రైతుల సంక్షేమం పట్ల సిఎం కు ఉన్న నిబద్ధత.


👉 గత ప్రభుత్వంలో మిల్లర్ల దోపిడీ నుండి తట్టుకోలేక రైతు వచ్చి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు వడ్లు పోసి నిరసన తెలిపే దుర్భర పరిస్థితి ఉండేది.


👉గత ప్రభుత్వంలో కొప్పుల ఈశ్వర్ మంత్రిగా వ్యవహరించినప్పటికి వరి ధాన్యం కొనుగోలు పైన కనీసం ఒక రివ్యూ మీటింగ్ గాని, సెంటర్ వద్దకు వెల్లి చూసింది గాని లేదు.


👉 జిల్లాకు సంబంధించి 72 వేల మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది.ఇతర సాంకేతిక కారణాల వల్ల సుమారు 19 వేల మందికి రుణమాఫీ జరగలేదు, వాటికి సంబంధించి రుణాలు సైతం మాఫీ చేస్తాం


👉 అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చి మా చేతిలో పెట్టారు, అయినప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం, మన ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు పడుతున్నాయి.


👉 ప్రజా విజయోత్సవల్లో భాగంగా ఈ నెల 7 న స్థానిక నంది చౌరస్తా వద్ద సభను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఫలాలను ప్రజలకు వివరిస్తాం


👉 గతంలో పునః ప్రారంభానికి సాధ్యం కాదు అని పక్కకు పెట్టిన ధర్మపురిలోని నైట్ కాలేజీని తిరిగి ప్రారంభించాం, చేగ్యం భూ నిర్వాసితులకు వారి పరిహారం ₹18 కోట్లు పంపిణీ చేశాం.


👉 సంక్షేమ శాఖకు మంత్రిగా వ్యవహించిప్పటికి కొప్పుల ఈశ్వర్, గురుకుల పాఠశాలకు పక్క భవనాలు నిర్మించలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే, ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సీయల్ స్కూల్ నీ మన నియోజకవర్గానికి మంజూరు చేయించి, దాని నిర్మాణానికి 25 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది.


👉 లిఫ్టుల నిర్వహణ కుడా ప్రభుత్వమే తీసుకోవాలని ఉత్తం కుమార్ రెడ్డిని కలిసి విన్నవించడం జరిగింది, నవోదయ కళాశాలను నియోజక వర్గంలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్రానికి వినతి పత్రాన్ని పంపించాను.


👉 ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన స్థలంలో ఒక 50 పడకలతో ఆసుపత్రి నిర్మాణం చేయాలనీ కూడా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది,


👉 ధర్మపురి నియోజకవర్గానికి సుమారు ₹ 20 కోట్ల రూపాయలను NREGS గ్రాంట్ ద్వారా, CRR గ్రాంట్ నుండి సుమారు ₹ 15 కోట్లకు పైగా రూపాయలను,TFIDC నిధుల ద్వారా మున్సిపాలిటీకి ₹15 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగింది.