👉ఆపరేటర్ ఉద్యోగాల పేరిట…
👉మోర్తాడ్ పోలీసుల అదుపులో ఏజెంట్ ?
J.SURENDER KUMAR,
తెలంగాణకు చెందిన పలువురు యువకులను కంప్యూటర్ ఆపరేటర్ డాటా ఎంట్రీ పేరిట లావోస్ పంపిస్తూ, ( అక్కడినుండి అక్రమ మానవ రవాణా పాల్పడుతున్న ) స్కామ్ లో జగిత్యాల జిల్లా ధర్మపురివాసి కీలక సూత్రధారి గా హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గాలిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా థాయిలాండ్ లో అదృశ్యమైన ఇద్దరు యువకుల ఆచూకీ కోసం మోర్తాడ్ పోలీసులు గురువారం ఓ ఏజెంట్ ను అదుపులోకి విచారిస్తున్నట్టు సమాచారం.
మంగళవారం హైదరాబాదులో ప్రవాసి ప్రజావాణి లో నిజామాబాద్ జిల్లా కు చెందిన శనిగరపు అరవింద్, జగిత్యాల జిల్లా కు చెందిన కొండ సాగర్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

కొన్ని రోజుల క్రితం జగిత్యాల జిల్లాకు చెందిన కొందరు ఏజెంట్లను, మధ్యవర్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో ఈ స్కామ్ లో ధర్మపురి పట్టణానికి చెందిన యువకుడి గూర్చి సైబర్ క్రైమ్ అధికారులకు వివరించినట్టు సమాచారం. లావోస్ లోని గోల్డెన్ ట్రయాంగిల్ ఎకనామికల్ సిటీ లో ‘ రోషన్ ‘ అనే పేరుతో సైబర్ క్రైమ్ కార్యకలాపాలను రోషన్ పర్యవేక్షిస్తాడని పోలీసులు సమాచారం సేకరించినట్టు తెలిసింది.
థాయిలాండ్, చైనా, లావోస్ మధ్య సైబర్ అడ్డాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరు ద్యోగ యువతీ, యువకులను కంప్యూటర్ డాటా ఎంట్రీ పేరుతో కొంత మంది ఏజెంట్లు నమ్మించి విజిట్ వీసాల పై మొదట థాయిలాండ్ పంపిస్తారు. అక్కడి నుంచి బస్సులు, ట్యాక్సీల ద్వారా థాయిలాండ్ సరిహద్దుల్లో లావోస్ సరిహద్దు నుండి ఆ దేశానికి తరలిస్తుంటారు.

వారి పాస్పోర్టులు తీసుకుని సైబర్ ఉచ్చులో దింపుతున్నారు. ఆ పనిని నిరాక రించిన వారిని పట్టణ సరిహద్దుకు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేస్తారని బాధితులు పోలీసులకు వివరించినట్టు సమాచారం.
సైబర్ నేరాలకు పాల్పడే చాలా మంది చైనీస్లు లావోస్లోని గోల్డెన్ ట్రయాంగిల్ సిటీని అడ్డాగా ఎంచుకుని తమ కార్యకలాపాలు కొనసాగిస్తు న్నారు.
తమ కార్యకలాపాలు కొనసాగే చోట పనిచే సే యువతీ, యువకులపై కూడా సీ సీ కెమెరాల నిఘాతో పర్యవేక్షిస్తుంటారు. వారి పర్యవేక్షణలో ఏదైనా పొరపాట్లు చేస్తే కఠినంగా శిక్షించడంతో పాటు, చిత్రహింసలకు గురిచేస్తుంటారు. ఇక్కడి నుంచి లావోస్ కు చేరుకున్న యువతీ, యువకులకు చైనీయుల పేరుతో ఐడీలు ఇస్తారు. ఫోన్లతో సైబర్ నేరాలకు పాల్పడేలా శిక్షణ ఇచ్చి నేరాలు చేయిస్తున్నారు.
డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట లావోస్ వెళ్లిన వారి సమాచారం కొన్ని రోజులపాటు కుటుంబ సభ్యులకు తెలియకపోవడంతో వారు పంపించిన ఏజెంట్ ను ప్రశ్నిస్తూ, నిలదీస్తూ తుమ వారి ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు, మానవ అక్రమ రవాణా, అక్కడ వారి నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తూ సైబర్ క్రైమ్ నేరాలు చేస్తున్న ముఠా కోసం గాలిస్తున్నట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న పలువురు యువకులు స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు పోలీసు యంత్రాంగం మానవ అక్రమ రవాణా స్కాంపై ఉక్కు పాదం మోపుతూ పలువురు ఏజెంట్లను అదుపులో తీసుకొని అరెస్టు చేస్తు రాకెట్ ఛేదించే దిశగా విచారణ చేస్తున్నారు.