మంథని లో రేపు గణపతి సహస్ర అభిషేకం!

👉 60 వ గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం !


J.SURENDER KUMAR,


సనాతన ధర్మ పరి రక్షణ కోసం లోక క్షేమం కోసం దత్త నవరాత్రులలో భాగంగా మంథని బ్రాహ్మణ సహాయం తో శుక్రవారం ( 13 డిసెంబర్ )  ఉదయం 9.00 గంటల నుండి మంథని గోదావరి నది కి వెళ్లే మార్గం లో ఉన్న ప్రాచీనమైన మహా గణపతి దేవాలయం లో 60 వ గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం నిర్వహించనున్నారు.

బ్రహ్మశ్రీ పల్లి రామ్ మోహన్  ఆధ్వర్యం అభిషేకం    నిర్వహించనున్నట్టు అభిషేక సమన్వయ కర్తవినోద్ కుమార్ మహావాది , తెలిపారు.

అభిషేకం తరువాత తీర్థ ప్రసాద వితరణ జరుగును వివరములకు వినోద్ కుమార్ మహావాది, అభిషేక సమన్వయ కర్త ఫోన్ నెంబర్.9000013755 సంప్రదించాల్సిందిగా ప్రకటనలో పేర్కొన్నారు.


👉 15 న హైదరాబాదులో…


ఈనెల 15 న  హైదరాబాదులోని బైరామల్ గూడ  శ్రీనివాస బంగారయ్య  గోశాల లో 61 వ గణపతి అతర్వ శీర్ష సహస్ర అభిషేకం ఉదయం 9 గంటల నుండి ప్రారంభమవుతుంది ప్రకటనలో పేర్కొన్నారు.


👉16 న చెన్నూర్ లో..


ఈనెల 16 న  సోమవారం చెన్నూర్ లో ఉన్న అంబా అగస్తేశ్వర దేవాలయం లో ఆర్ద్రా నక్షత్ర యుక్త 62 వ గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో 4. గంటల నుండి  జరుగును 

పంచ క్రోస ఉత్తర వాహిని గోదావరి తీర ప్రాంతం  ఉన్న అంబా అగస్తేశ్వర దేవాలయం లో అంగరంగ వైభవంగా వేదొక్తంగా  అభిషేక కార్యక్రమం లో పాల్గొని స్వామి వారి అనుగ్రహం పొందగలరని


సహస్ర అభిషేక సమన్వయ కర్త వినోద్ కుమార్ మహావాది ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలకు
ఫోన్ నెంబర్ 9000013755 సంప్రదించాలని పేర్కొన్నా
రు.