J.SURENDER KUMAR,
మంత్రి శ్రీధర్ బాబు స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ లో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో దత్త నవరాత్రుల సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి.

ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాతృమూర్తి సోదరుడు దుద్దిళ్ళ శ్రీను బాబు దంపతులు, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు దేవాలయ ప్రాంగణంలో సతిసమేతంగా చండి యాగం లో పాల్గొన్నారు.
అనంతరం ఆలయ అర్చకులు వీరికి తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దేవాలయానికి విచ్చేసి దత్తుని సేవలో తరించారు.

అనంతరం శ్రీను బాబు మాట్లాడుతూ ప్రజలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరు పై చూపాలని వేడుకున్నట్లు తెలిపారు.