J.SURENDER KUMAR,
నాలుగు దశాబ్దాల కాలంగా అజ్ఞాతంలో కొనసాగుతూ మావోయిస్టు పార్టీ లో కీలక నేతగా ఎదిగిన బల్మూరి నారాయణరావు ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతూ నక్సల్ పార్టీలో చేరాడు.
మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు @ గణపతి ఒకే సామాజిక వర్గానికి చెందినవారు.

1982 83లో ఇంటర్ చదువుతుండగా రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో విద్యార్థి నారాయణరావు కోసం గాలిస్తుండగా అజ్ఞాతంలోకి వెళ్ళాడు.
👉సామాన్య కుటుంబం..

వెలమ సామాజిక వర్గం బీర్పూర్ కు చెందిన బల్మూరి నారాయణరావు ది సామాన్య కుటుంబం. ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు తోబుట్టువులు గల పెద్ద కుటుంబం. నారాయణరావు చిన్నవాడు, వెంకట్రావు సోదరుడు సింగిల్ విండో సెక్రెటరీగా పనిచేసేవాడు. మరో సోదరుడు రామారావు అనారోగ్యంతో చనిపోయాడు. తల్లిదండ్రులు కిషన్ రావు, సుశీలమ్మ, నారాయణరావు ఆచూకీ కోసం పదేపదే పోలీసులు మీరి ఇంటికి వచ్చి వేధించడంతో సోదరుడు వెంకట్రావు తన గత 20 సంవత్సరాల క్రితమే ఉద్యోగానికి రాజీనామా చేసి కరీంనగర్ లో జీవనం కొనసాగిస్తున్నాడు.
👉ఇంటిని అమ్ముకున్నారు !
బీర్పూర్ గ్రామంలో నారాయణ రావు ఇంటిని కుటుంబ సభ్యులు అమ్ముకొని ఇతర ప్రాంతాలకు వెళ్లారు. బీర్పూర్లో గజము స్థలము లేదు.
👉బీర్పూర్ లో పోటా పోటీగా స్థూపాలు!
మావోయిస్టు అగ్రి నేత గణపతి స్వగ్రామం బీర్పూర్ కావడంతో ఇక్కడ మావోయిస్టులు బస్టాండ్ లో అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు.

దీనికి పోటీగా పోలీస్ యంత్రాంగం ధరంపురి వైపు ఉన్న మరో బస్టాండ్ లో శాంతి స్థూపం నిర్మించారు.

సీనియర్ మావోయిస్టు కప్రభాకర్ అలియాస్ బాలమూరి నారాయణరావు SZCM ర్యాంక్ నక్సలైట్‌ని కంకేర్ పోలీసులు అరెస్టు చేశారు.
సీనియర్ మావోయిస్టు నాయకుడు ప్రభాకర్ అలియాస్ బాలమూరి నారాయణరావు 1984లో నక్సల్ సంస్థలో పార్టీ సభ్యునిగా రిక్రూట్ అయ్యి గత 40 ఏళ్లుగా చురుకుగా పనిచేస్తున్నారు.