మా పోలీస్ స్టేషన్ లో హత్య నిందితులు లొంగిపోయారు!

👉హాతుడు ఉత్తరప్రదేశ్ వాసి !


👉హత్య నిందితులు ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి వాసులు!


👉ధర్మపురి పోలీస్ పత్రికా ప్రకటనలో..


J.SURENDER KUMAR,


మా పోలీస్ స్టేషన్ కు శనివారం పగలు ఇద్దరు వ్యక్తులు ఒకరిని హత్య చేసినట్టుగా చెప్పు లొంగిపోయారు. హత్య గావించబడ్డవాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాహుల్ సూర్య ప్రకాష్ సింగ్ (27) అతడిని చంపి మృతదేహాన్ని అడవిలో  పెట్రోల్ పోసి కాల్చివేసామని లొంగిపోయిన నిందితులు చెప్పారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ధర్మపురి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్ జారీ చేసిన ప్రెస్ నోట్ పేర్కొన్నారు. ఈ వార్త అక్షర సత్యం.


👉పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జారీచేసిన ప్రెస్ నోట్ లు వివరాలు ఇలా ఉన్నాయి !

ఈరోజు అనగా తేదీ: 21.12.2024 రోజున సుమారు ఉదయం 12.30 గంటల సమయంలో నేరెళ్ల గోపాల్ s/o రమేష్, వయస్సు 29 సంవత్సరాలు, కులం గౌడ్స్, r/o కమలాపూర్ గ్రామం మరియు గండికోట శేఖర్ s/o శ్రీనివాస్, వయస్సు 27 సంవత్సరాలు, కులం: వడ్డెర అను ఇద్దరు హత్య కేసు లో నిందితులు పోలీస్ స్టేషన్ కి వచ్చి, 

👉 గోపాల్ ఈ విదంగా తెలిపినాడు ,

సుమారు 2-నెలల క్రితం ముంబయిలో మాల్వాని బీచ్ లో మెరుగు లక్ష్మణ్ @ లస్మయ్య r/o నేరెళ్ల గ్రామం అను అతడు ఎవరితోనే ఫోన్లో మాట్లాడుకుంటూ తన మరుదలును ఇబ్బంది పెట్టుతున్న తోకల గంగాధర్ అను అతన్ని చంపాలి ఎవరన్నా వుంటే మాట్లాడు, అని ఫోన్ లో మాట్లాడుతుండగా, మెరుగు లక్ష్మణ్ గోపాల్ కు పరిచయం వున్నందున గోపాల్ తన స్నేహితుడు అయిన రాహుల్ సూర్య ప్రకాష్ సింగ్, S/O: సూర్య ప్రకాష్ సింగ్, వయస్సు 27 సంవత్సరాలు r/o ఉత్తర ప్రదేశ్ రాస్ట్రం అను అతడు నీ పని చేస్తాడని లక్ష్మణ్ చెప్పి, నా ఫోన్ తోనే రాహుల్ సూర్య ప్రకాష్ సింగ్ కు మాట్లాడించగా

👉4-లక్షలకు తోకల గంగాధర్ ను చంపడానికి సూఫారి మాట్లాడుకొన్నారు,

తరువాత  రాహుల్ సూర్య ప్రకాష్ సింగ్ గోపాల్ ను అట్టి డబ్బుల గురించి గోపాల్ ను అడుగగా, గోపాల్ మెరుగు లక్ష్మణ్ ను అడిగితే ఎవరిని చంపడం అవసరం లేదు అని చెప్పడంతో, రాహుల్ సూర్య ప్రకాష్ సింగ్ అట్టి డబ్బులను గోపాల్ ఇవ్వాలని, లేదంటే గోపాల్ తండ్రి రమేష్ ను చంపుతా అని బెదిరించగా, ఎలాగైనా రాహుల్ సూర్య ప్రకాష్ సింగ్ ను చంపాలని గోపాల్ పథకం పన్ని రాహుల్ సూర్య ప్రకాష్ సింగ్ ను,
👉తేదీ: 12.12.2024 రోజున బొంబాయి నుంచి నేరళ్లకు తీసుకు వచ్చి,

తేదీ: 13.12.2024 రోజున సుమారు రాత్రి 11.30 గంటల సమయంలో రాహుల్ సూర్య ప్రకాష్ సింగ్ ను గోపాల్ మరియు శేఖర్ ఇద్దరు నేరళ్ళ గ్రామా శివారులో వున్న సాంబ శివుని గుడి వద్దకు Mahindra TUV 300 కారులో తీసుకొని పోయి గోపాల్ ఒక్క పెద్ద బండరాయితో రాహుల్ సూర్య ప్రకాష్ సింగ్ చంపాలనే ఉద్దేశ్యంతో తలపై మూడు సార్లు కొట్టి చంపి,

👉శవంను, అదే రోజు రాత్రి

అక్కడ నుంచి సుమారు 5-కిలోమీటర్ల దూరంలో నేరాళ్ల గ్రామ శివారులో బట్టపల్లి పోతారం గ్రామంకు వెళ్ళు రూట్ నుంచి అడవి ప్రాంతంలో లోపలికి అదే కారులో ఇద్దరు కలిసి తీసుకెళ్ళి, అక్కడ కట్టెలు పెట్టి, పెట్రోల్ పోసి దహనం చేసినరు. ఈరోజు వచ్చి పోలీస్ స్టేషన్ లో నిందితులు లొంగి పోగా కేసు నమోదు చేయడం జరిగింది మరియు దర్యాప్తు కొనసాగుతుంది.. ఆని ధర్మపురి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్ పేరుతో ప్రెస్ నోట్ సాయంత్రం విడుదల చేశారు.

ధర్మపురి పోలీసులు శనివారం జారీ చేసిన ప్రెస్ నోట్.

👉పోలీసులకు శ్రమ లేకుండానే..

బీర్పూర్ లో వ్యాపారి ఇంటిలో చొరబడి  దాడి చేసి బంగారం, నగదు చోరీ చేసిన నిందితులను దొంగ సొత్తు తో పట్టుకోవడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం శ్రమ పడిన తీరు నేర పరిశోధనలో. పోలీస్ అధికారుల పాత్రను అభినందించి ప్రశంస పత్రం పురస్కారం అందించిన జిల్లా పోలీస్ యంత్రాంగానికి శ్రమ లేకుండా నేర పరిశోధన చేయకుండా తామే హత్య చేశామని ఇద్దరు నిందితులు పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోవడం ఫ్రెండ్లీ పోలీస్ సింగ్ కు నిదర్శనం..

అయితే పోలీసులు ముంబైలో హతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఉండి ఉండవచ్చు. అయితే గత కొన్ని రోజుల క్రితం ఈ పరిధిలోని గుర్తు తెలియని శవం అంటూ మండలంలో వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే.
ఈ ఈ సంఘటన తీరుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.