J.SURENDER KUMAR,
ధర్మారం మండలం మేడారం గ్రామంలో మంగళవారం రోజున CSR నిధుల ద్వారా ₹ 45 లక్షల వ్యయంతో మేడారం గ్రామం గొల్లవాడ నుండి గోపాలరావు పెట్ వరకు మంజూరు అయినా ఫార్మేషన్ రోడ్డు నిర్మాణానికి ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం శంకుస్థాపన చేశారు.

అనంతరం మండల ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనీ ₹ 44,38,500 లక్షల రూపాయల విలువ గల 150 చెక్కులను లబ్దిదారులకు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
మేడారం గ్రామం గొల్లవాడ నుండి గోపాలరావు పెట్ వరకు CSR నిధుల నుండి ₹ 45 లక్షల వ్యయంతో మంజూరు అయినా ఫార్మేషన్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వంతో దృష్టికి తీసుకెళ్లి csr నిధుల ద్వారా ఇట్టి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.

జడ్పీ కి కూడా కనెక్టింగ్ కావాలని ప్రజలు నా దృష్టికి తీసుకురావడం జరిగిందని, దానికి సంబంధించి కూడా నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందనీ, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి మేడారం గ్రామానికి సోలార్ ప్రజక్ట్ ను కూడా మంజూరు చేస్తామని ప్రకటించడం జరిగిందని, దానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ విషయంలో కూడా గ్రామ సభ నిర్వహించి అర్హులైన పేదవారికి ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు.

ప్రభుత్వం పదకొండున్నర శాతం వడ్డీతో అప్పులను తీసుకొచ్చి అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మాకు అప్పగించినప్పటికి వాటిని తీరుస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని, ధర్మపురి వద్ద గోదావరిలో మురుగు నీరు కలవకుండా STP నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, అదే విధంగా వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కోటిలింగాల పుణ్యక్షేత్రాలను కలుపుతూ టూరిజం కారిడార్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కోరడం జరిగిందనీ వారు కూడా ఇట్టి విషయాలపై సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు