J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జనవరి 10 న జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కు ఆలయ అధికారులు ఆహ్వానించారు.
ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మంగళవారం దేవస్థానము ఈ ఓ సంకటాల శ్రీనివాస్ వేదపండితులు అర్చకులతో కలిసి ఆహ్వనం తో పాటు శేష వస్త్ర ప్రసాదం అందించారు.

వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ , ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చార్యులు సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ పాల్గొన్నారు.