J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లంల గ్రామ శివారులో ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు.
అలాగే, ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టులో కీలకమైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి ముఖ్యమంత్రి నీటిని విడుదల చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ , కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
👉యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతికి అంకితం !

నల్గొండ జిల్లా దామరచర్ల లోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. నాలుగు వేల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 800 మెగావాట్ల యూనిట్-2 నుంచి వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి, గ్రిడ్‌కు అనుసంధానించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
అంతకుముందు థర్మల్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కలిసి ఆవిష్కరించారు. ఈ థర్మల్ స్టేషన్‌లోని 800 మెగావాట్ల యూనిట్-2 వద్ద పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు.
కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర్ రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు , కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు రఘువీర్ రెడ్డి , చామల కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
👉వైద్య కళాశాల ప్రారంభం !

నల్గొండ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన వైద్య కళాశాల భవనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థుల వైట్ కోట్ సెరమనీలో పాల్గొన్నారు.

అక్కడ పలువురు విద్యార్థుల కాలేజీ అనుభవాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ , తుమ్మల నాగేశ్వరరావు , కోమటిరెడ్డి వెంకటరెడ్డి , జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.