👉 ట్రాక్టర్ ఇసుక కు ₹ 800/- జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లాలో నిర్మాణ అవసరాల కోసం అందుబాటు ధరలతో ఇసుకను సరఫరా చేయుటకు శనివారం జిల్లా కలెక్టర్ జగిత్యాల అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది.
👉 జిల్లాలోని రాయికల్ మండలంలో ఇటిక్యాల !
👉 మెట్పల్లి మండలంలో ఆత్మకూర్ !
👉 కోరుట్ల మండలంలో పైడిమడుగు !
👉 కథలపూర్ మండలంలో సిరికొండ గ్రామలలో ఇసుక రీచ్ లను గుర్తించారు !
ప్రజలకు అవసరాల నిమిత్తం ఇసుకను సరఫరా చేయుటకు జగిత్యాల జిల్లా కలెక్టర్ ఒక ట్రాక్టర్ (3) క్యూబిక్ మీటర్ల కు ₹ 800/- (ఎనిమిది వందల రూపాయలు) ధరను నిర్ణయించారు. జిల్లాలో ప్రజలు వారి అవసరాల నిమిత్తం సంబంధిత తహసీల్దార్లను సంప్రదించి ఒక ట్రాక్టర్ (3) క్యూబిక్ మీటర్లకు ₹ 800/- డి.డి. రూపంలో చెల్లించి అనుమతులు పొంది ఇసుక రవాణా మాత్రమే చేసుకోవాలని సూచించారు.
👉 ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా చెయ్యాలని, సెలవు దినాల్లో ఇసుక రవాణా చేయవద్దని కలెక్టర్ ఆదేశించారు.
ట్రాక్టర్ యజమానులు ఇట్టి విషయంలో అవగాహన చేసుకుని ప్రభుత్వం ద్వారా నిర్దేశించబడిన రీచ్ ల నుండి తహసిల్దార్ అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ఇసుకను రవాణా చేయుటకు చేయాలని ఆదేశించారు.
ట్రాక్టర్ల యాజమాన్యులు నిబంధన మేరకు ఇసుక రవాణా చేయాలని అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ మొదటిసారిగా పట్టుబడితే ₹ 25,000/- రూపాయలు రెండవసారి పట్టుబడితే ₹ 50,000/- రూపాయలు జరిమానా విధిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా ప్రజలు ప్రభుత్వం ద్వారా నిర్దేశించిన నుండి ఇసుకను వారి అవసరాల నిమిత్తం రవాణా చేసుకోవాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రకటనలో ప్రజలను కోరారు.