ప్రజల అభిప్రాయాల మేరకే పుష్కర పనులు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


2027లో జరగనున్న గోదావరి నది పుష్కరాల పనులను స్థానిక ప్రజల సమిష్టి అభిప్రాయాల మేరకే పనులు చేపడుతామని, ఎవరికి నష్టం కలిగించబోమని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సోమవారం ధర్మపురి పట్టణంలో అధికారులు, స్థానికులతో కలిసి పర్యటించారు.


ఈ సందర్భంగా మొదట స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మరియు రామ లింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య నుండి పాదయాత్రగా తీసుకువచ్చిన శ్రీరామ చంద్రుడి పాదుకలను దర్శించుకున్నారు.

అనంతరం గోదావరి పరివాహక ప్రాంతాన్ని మ వేజ్ – నాన్ వేజ్ మార్కెట్ సముదాయాన్ని భక్తుల విశ్రాంతి గృహాలను, బస్టాండ్ ప్రాంగణం, నిర్మాణంలో ఉన్న ఆలయ దుకాణాల సముదాయాన్ని పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు తీరుపై మున్సిపల్ అధికారులకు తగు సూచనలు చేశారు.


👉ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.

.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో 2027 లో జరగనున్న గోదావరి నది పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందన్నారు.


పుష్కరాలకు తరలివచ్చే లక్షలాదిమంది భక్త జనంకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తుగా పుష్కర పనులు చేపట్టనున్నామని అన్నారు. అయితే పుష్కర నిర్మాణ పనులు స్థానిక ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాల మేరకు సాధ్యాసాధ్యాలను అధికార యంత్రాంగం నేనే మేరకే పనుల జరుగుతాయన్నారు. ఎవరికి నష్టం కలుగకుండా పనులు చేపట్టనున్నట్టు వివరించారు.


👉గోదావరి నది జలాలు కలుషితం కాకుండా పనులు !


గోదావరి నదిలో డ్రైనేజీ నీరు కలవకుండా STP నిర్మాణానికి పరిపాలన అనుమతుల కొరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, అదే విధంగా మార్కెట్ లో కూరగాయలు విక్రయదారులకు ఇబ్బందులు కలగకుండా వేజ్ మరియు నాన్ వేజ్ మార్కెట్లో ఉన్న గద్దెలను కూడా కూల్చేయాలనీ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జరిగిందనీ,ధర్మపురి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు వసతి విషయంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అలయ అధికారులను ఆదేశించినట్టు వివరించారు.

గత పాలకులు కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయక పనులు అసంపూర్తిగా ఉండిపోవడం జరిగిందని,దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బిల్లులు విడుదల చేయిస్థామనీ, మాత శిశు ఆసుపత్రి మిగులు పనులను పూర్తి చేయించి త్వరలోనే ప్రారంభిస్తామని, ఆటో డ్రైవర్లు ఆటో స్టాండ్ కావాలని కోరడం జరిగిందనీ, బస్ స్టాండ్ అవరలో కొంత స్థలం ఉందని మా దృష్టికి తీసుకురావడం జరిగిందని దానికి కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి స్టాండ్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.


అయోధ్య నుండి పాదయాత్రగా ధర్మపురి పుణ్య క్షేత్రానికి చేరుకున్న శ్రీరామ చంద్రుడు పాదుకలను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆ రామ చంద్రుడి మరియు లక్ష్మీ నరసింహ స్వామి వారి కృప కటాక్షాలు నియోజకవర్గ ప్రజానీకం పైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, రామాలయ ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో వారు ఎటువంటి కార్యక్రమం చేపట్టిన వారికి అండగా ఉంటామని తెలిపారు..


ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..