ప్రజలు కోరుకోవడం తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది !

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, క్రిస్మస్ సందర్భంగా !


J.SURENDER KUMAR,


రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకోవడం తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని, ఈ రోజు అధికారికంగా ఎమ్మెల్యే, విప్ హోదాలో క్రైస్తవ సోదర సోదరీమణుల మధ్య వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


క్రిస్మస్ సందర్భంగా పెగడపెల్లి లో CSI చర్చి, వెల్గటూర్ మండలం లోసియోన్ గాస్పల్ మినిస్ట్రీస్ చర్చి, ధర్మారం మండలంలోని పలు చర్చిలలో బుధవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనీ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదీమణుల కు శుభాకాంక్షలు తెలిపారు.

ఆ క్రీస్తును కృప కటాక్షాలు ఎల్లవేళలా ధర్మపురి నియోజక వర్గ ప్రజల పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు అన్నారు.


ఇతరుల పట్ల ప్రేమ, సహనం, శాంతి, సేవాభావం వంటి గొప్ప గుణాలను ఆచరించాలని శాంతి దూత ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ఆ ప్రభువు యొక్క కృప తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద అదేవిధంగా ముఖ్యమంత్రి మీద ఉండే విధంగా ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చే విధంగా ఆ దేవుని కృప నాపై ఉండాలని క్రైస్తవ సోదర సోదరీమణులు ప్రార్థించాలని కోరారు


ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..