ప్రమాద బాధితులను వాహనంలో తరలించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


నియోజకవర్గ పర్యటనలో భాగంగా వాహన శ్రేణితో వెళుతున్న ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ శనివారం రోడ్డు ప్రమాదానికి గురి అయిన బాధితులను వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

వివరాలు ఇలా ఉన్నాయి

రాయపట్నం కరీంనగర్ రాష్ట్ర రహదారి పై
ధర్మారం మండలం బంజర్ పల్లె గ్రామం వద్ద పేర్కపల్లె గ్రామస్తులు రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. రక్త గాయాలతో రోడ్డుపై పడి ఉన్నారు..

ఈ సంఘటన చూసిన ఎమ్మెల్యే తన వాహన శ్రేణిని ఆపి గాయపడిన వారిని పరామర్శించి త్వరితగతిన వారికి వైద్య చికిత్సలు కోసం తన ఎస్కార్ట్ వాహనంలో బాధితులను ఆసుపత్రికి పంపించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఫోన్ ద్వారా కోరారు.

👉 బహుమతి ప్రధానోత్సవం లో..

డ్రాగేన్ స్క్వాడ్ అకాడమి ఆధ్వర్యంలో ధర్మారం మండలం ఖిలవనపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన బ్లాక్ బెల్ట్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొని కరాటే విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ లను ప్రదానం చేశారు.