ప్రతి లాడ్జిలో సీసీ కెమెరాలు తప్పనిసరి !

👉ఎస్సై ఉదయ్ కుమార్.!


J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో ప్రతి లాడ్జి లలో సీసీ కెమెరాలు తప్పనిసరి ఏర్పాటు చేయాలని
సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశించారు.
సోమవారం పోలీస్ సిబ్బంది తో క్షేత్రంలోని లాడ్జ్ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, అన్ని లాడ్జ్ లలో సీసీటీవీ కెమెరాలు మరియు రిజిస్టర్ బుక్ ను పరిశీలించారు.

ఇక నుండి సీసీటీవీ కెమెరాలు,యాత్రికుల నుంచి వారి వద్ద ఆధార్ కార్డ్ తీసుకోవాలని సూచించారు అదేవిధంగా,అంతేకాకుండా, వారు లాడ్జ్ లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యజమానులను ఆదేశించారు. , లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు