J.SURENDER KUMAR,
శీతాకాల విడిది కోసం మంగళవారం హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కు హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఘన స్వాగతం లభించింది.
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రపతి కి స్వాగతం పలికారు.

రాష్ట్రపతి కి స్వాగతం పలికినవారిలో మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తాతో పాటు త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.