రేవంత్ రెడ్డి ప్రభుత్వం పద్ధతులు మార్చుకుంటేనే మనుగడ !

👉 రౌండ్ టేబుల్ సమావేశం లో వక్తల అభిప్రాయం !


J.SURENDER KUMAR,


రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కొన్ని పద్ధతులు మార్చుకుంటే నే మనుగడ సాగిస్తుందని రౌండ్ టేబుల్ సమావేశం లో వక్తల అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) ఆధ్వర్యంలో మంగళవారం దేశోద్ధారక భవన్, బషీర్ బాగ్ లో ‘ప్రజల ఆకాంక్షలు_ ఏడాది ప్రభుత్వ పాలన’ అన్న అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.


రాష్ట్రంలో పదేళ్ళు అధికారం చేపట్టిన గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వ పనితీరుకు ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు పెద్ద తేడా అగుపించడం లేదని రౌండ్ టేబుల్ సమావేశం లో పాల్గొన్న మెజార్టీ వక్తలు అభిప్రాయపడ్డారు.


TUWJ రాష్ట్ర అధ్యక్షుడు కే.విరహత్ అలీ మోటివేటర్ గా వ్యవహరించారు. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో OU జర్నలిజం విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ పద్మ షా, తెలుగు రాష్ట్రాల ఎన్నికల నిఘా వేదిక అద్యక్షుడు డాక్టర్ వి.వి రావు, ప్రముఖ గేయ రచయిత, ప్రజా గాయకులు మాస్టార్జీ, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్, సామాజిక విశ్లేషకురాలు సజయ, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అద్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సామాజిక విశ్లేషకుడు డాక్టర్ పి. వినయ్ కుమార్, లోక్ సత్తా నాయకుడు, సీనియర్ పాత్రికేయుడు తుమ్మలపల్లి శ్రీనివాస్, కోవా అద్యక్షుడు మజార్ హుస్సేన్, హైకోర్టు సీనియర్ న్యాయవాది ముస్తాన్ మాలిక్ తదితరులు పాల్గొని ప్రభుత్వ ఏడాది పాలనపై వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సమావేశంలో TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ తదితరులు పాల్గొన్నారు.