సంవత్సర పాలనలో ప్రజా సంక్షేమ కోసం కృషి చేశాను!

👉సంవత్సర కాలంలో అమలు చేసిన సంక్షేమ వివరాలు


👉హామీలు అమలు చేయడానికి కృషి చేస్తాను !


👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్.!


J.SURENDER KUMAR,


సంవత్సర కాల ప్రజా పాలనలో

ప్రజ సంక్షేమం కోస. కృషి చేశానని,

ప్రజలకు ఇచ్చిన హామీ అమలు కోసం

నా శాయ శక్తులు కృషి చేస్తానని

ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.


ఎమ్మెల్యేగా 2023 డిసెంబర్ 3న ఎన్నికైన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తన సంవత్సర పాలనలో ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాల వివరాలను బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ యంత్రాంగం  విడుదల చేసిన ప్రకటన లో పేర్కొంది.


👉 వివరాలు ఇలా ఉన్నాయి…


👉 1.NREGS grant…₹10 కోట్లు మంజూరు (సీసీ రోడ్లు, డ్రైనేజీ లు)


👉 2.SDF grant…_₹10 కోట్లు మంజూరు…(6 కోట్లు బోర్ వెల్స్)


👉 3.CRR గ్రాంట్..₹ 15 కోట్లు మంజూరు…(కనెక్టింగ్ రోడ్స్ నిర్మాణం)


👉 4.10 సంవత్సరాల నుండి చేగ్యం ముంపు బాధితులకు అందని ₹18 కోట్ల పరిహారాన్ని మంజూరు చేయించడం


👉 5.గత ప్రభుత్వంలో తిరిగి ప్రారంభించనీ నైట్ కాలేజీనీ తిరిగి ప్రారంభించడం


👉 6.నైట్ కాలేజీ లో వసతుల కల్పన మరియు మరమ్మతులకు తన నిధుల నుండి స్వయంగా ₹ 5 లక్షల రూపాయలను కేటాయించడం


👉 7.ఆగస్టు నెల నుండి డిసెంబర్ నెల వరకు CMRF చెక్కులు..3706 చెక్కులకు సంబంధించిన ₹ 8 కోట్ల 35 లక్షల 25 వేల 5 వందల రూపాయలను మంజూరు చేయించడం


👉 8.పట్ట ఉండి మోఖా పై లేని గాదెపల్లి రెవెన్యూ శివారులో గల దాదాపు 87 మంది భూ యజమానులకు మొక చూపించి హద్దులకు సంబంధించిన పత్రాలను పంపిణీ చేశారు


👉 9.బుగ్గరం మండల కేంద్రంలో నూతన ప్రభుత్వ కార్యాలయ నిర్మాణానికి భూమి చేయడం జరిగింది


👉 10.ఐటిఐ కలశాల,ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి ప్రపోజల్స్ పంపించడం జరిగింది


👉 11.నియోజకవర్గానికి సంబంధించిన ₹ 10కోట్ల 10లక్షల 18వేల 812 రూపాయల విలువగల 1061 కళ్యాణ లక్ష్మీ శాది ముభారక్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.


👉 12.ధర్మపురి నియోజకవర్గానికి విప్  చొరవతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్ సముదాయం మంజూరు చేయించడం జరిగింది


👉 13.గత ప్రభుత్వంలో చర్చిలకు సంబంధించిన పనులు పూర్తి చేయకుండా ప్రభుత్వానికి తిరిగి పంపిన సుమారు ₹ 96 లక్షల 50 వేలకు పైగా నిధులను ప్రస్తుత ప్రభుత్వంతో మాట్లాడి అట్టి నిధులను వెనక్కి తీసుకొచ్చి సుమారు 40 కి పైగా చర్చి పాస్టర్లు వర్క్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది.


👉 14..నియోజకవర్గానికి సంబంధించి జనవరి నుండి డిసెంబర్ వరకు ₹ 1 కోటి 59 లక్షల 25 వేల రూపాయల విలువ గల 85 LOC లను బాధితులకు అందజేశారు.


👉 15.NREGS గ్రాంట్ కింద నవంబర్ నెలలో ధర్మపురి నియోజక వర్గానికి సీసీ రోడ్లు డ్రైనేజీ,అంగన్వాడి భవన నిర్మాణానికి ₹ 10 కోట్ల రూపాయలు మంజూరు.


👉 16.నియోజక వర్గానికి సంబంధించి ఇతర దేశాల్లో ప్రమాదవ శాత్తూ మృతి చెందిన 4 గురు మృతుల కుటుంబాలకు NRI పాలసి కింద ఒక్కో కుటుంబానికి ₹ 5 లక్షల చొప్పున ₹ 20 లక్షల రూపాయల మంజూరు.


👉 17.ధర్మపురి మున్సిపాల్టీలోనీ ఇందిరమ్మ కాలానికి చెందిన 60 మంది లబ్ధదారులకు ఇంటి నెంబర్లు కేటాయించి ఓనర్ షిప్ సర్టిఫికేట్లు పంపిణీ చేయడం జరిగింది.


👉 18..ధర్మపురి నుండి హైదరాబాద్ వరకు ప్రయాణికుల, భక్తుల సౌకర్యర్థం రాత్రి 11 గంటల నుండి సూపర్ లగ్జరీ బస్సును అక్టోబర్ నెలలో ప్రారంభించడం.


👉 19.ధర్మపురి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు TFIDC నిధుల నుండి ₹15 కోట్ల రూపాయలను మంజూరు చేయడం..


👉 20.ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి 2 లక్షల  రుణమాఫీ మొదటి విడతలో 14798 మంది రైతులకు ₹ 70.1 కోట్ల రూపాయలు,రెండవ విడతలో 6309 మంది రైతులకు ₹ 54.7 కోట్ల రూపాయలు,మూడవ విడతలో 4599 మంది రైతులకు ₹ 57 కోట్ల రూపాయల మేర రుణా మాఫీ చేయడం జరిగింది


👉 21.ధర్మారం మండలం పత్తిపాకలో పత్తిపక రిజర్వాయర్ మంజూరు చేయించడం,దానికి సంబంధించి బడ్జెట్లో ₹ 5 వందల కోట్ల రూపాయలను కేటాయించడం


👉 22.మహా లక్ష్మీ పథకం కింద 500 కి గ్యాస్ సిలిండర్ స్కీమ్ ద్వారా ధర్మపురి నియోజకవర్గంలో 56,559 మంది లబ్ధదారులకు సంబంధించి 1,54,797 సిలిండర్లు డెలివరి చెయ్యగా,దానికి సంబంధించిన ₹ 4 కోట్ల 57 లక్షల 7 వేల రూపాయల సబ్సిడీ అమౌంట్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది.


👉 23.మహాలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ స్కీమ్ ద్వారా ధర్మపురి నియోజకవర్గంలో 56,694 మంది లబ్ధదారులకు 1కోటి,97 లక్షల,65 వేల854 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగింది.


👉 24.ఎమ్మెల్యే చొరవతో వెల్గటూర్, బుగ్గారం మండలాలకు 108 అంబులెన్సులు  మంజూరు చేయించడం జరిగింది.


👉 పరామర్శలు,వివాహాలకు అందించిన ఆర్థిక సహాయం.!!

ఫైల్ ఫోటో.

👉 1.బుగ్గరం మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన న్యతరి తిరుపతి అగ్ని ప్రమాదంలో గాయలవ్వగా ₹ 4 వేల ఆర్థిక సహాయం అందించారు..


👉 2.ధర్మపురి పట్టణానికి చెందిన రిపోర్టర్ కొంక సుదీర్ గారి కుమారుడికి చెయ్యి విరగగా వారినీ పరామర్శించి ₹10 వేల ఆర్థిక సహాయం అందించారు


👉 3.గొల్లపెల్లి మండలం లోత్తూనూరు గ్రామానికి చెందిన కాళ్ళ రాకేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ₹10 వేల ఆర్థిక సహాయం అందించారు


👉 4.బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన దిటి శ్రీనివాస్, దిటీ మహేష్ ల మృతి చెందగా వారి కుటుంబాలకు ₹10 వేల రూపాయల చొప్పున ₹20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు


👉 5.పెగడ పెల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రాజనర్సయ్య మృతి చెందగా వారి కుటుంబానికి  ₹5 వేల ఆర్థిక సహాయం అందించారు


👉 6.గొల్లపెల్లి మండలం శ్రీరాముల పల్లె కి చెందిన బాలే లస్మయ్య మృతి చెందగా వారి కుటుంబానికి ₹ 5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు


👉 7.వెల్గటూర్ కిషన్ రావుపేటకి చెందిన కొత్తపల్లి నవీన్ మృతి చెందగా వారి కుటుంబానికి ₹ 5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు


👉 8.ధర్మారం మండలం సాయంపేట గ్రామానికి చెందిన ఓదెలు దుబాయిలో మృతి చెందగా వారి కుటుంబానికి ₹ 5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు


👉 7.ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో కునరపు రాజు మృతి చెందగా వారి కుటుంబానికి ₹ 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు


👉 8.ధర్మపురి మండలం నేరెళ్ల కి చెందిన నూకల సత్తవ్వ అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం జరగగా ₹8 వేల ఆర్థిక సహాయాన్ని,25 కేజీల బియ్యాన్ని అందజేశారు


👉 9.ధర్మపురి పట్టణంలోని కాశెట్టి వాడకు చెందిన వనిత మృతి చెందగా వారి కుటుంబానికి ₹5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు


👉 10.పెగడపెల్లి మండలం ల్యాగల మర్రి గ్రామానికి చెందిన ఉప్పులేటి గంగమ్మ మృతి చెందగా వారి కుటుంబానికి ₹ 5 వేల ఆర్థిక సహాయం అందించారు


👉 10.ధర్మపురి మండలం నక్కల పేట గ్రామానికి చెందిన ముడుసుల శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా చికిత్స కోసం ₹10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు


👉 11.ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన మిట్ట మల్లేశం మృతి చెందగా వారి కుటుంబానికి ₹5 వేల ఆర్థిక సహాయం అందించారు


👉 12.ధర్మపురి పట్టణానికి చెందిన పార్టీ కార్యకర్త నిరంజన్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా ₹ 50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు


👉 13.ధర్మపురి మండలం నేరేళ్ళ గ్రామానికి చెందిన ఈధునూరి వేణుగోపాల్  రోడ్డు ప్రమాదంలో గాయపడగా చికిత్స కోసం ₹10 వేల ఆర్థిక సహాయం,


👉 14.ధర్మపురి పట్టణానికి చెందిన నారవేని రాజ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబానికి ₹5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు


👉 15.ధర్మపురి మండలం రాయపట్నం గ్రామనికి చెందిన గిడిషేల సంపూర్ణ వివాహానికి ₹10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు


👉 16.ధర్మపురి మండలం రాయపట్నం గ్రామనికి చెందిన గిడిషేల రాజమ్మ వైద్యానికి 3 వేల ఆర్థిక సహాయం మరియు 50 కేజీల బియ్యాన్ని అందజేశారు


👉 17.ధర్మపురి మండలం కమలపూర్ గ్రామానికి చెందిన ఒడ్డెటి వనిత వివాహానికి ₹ 10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు


👉 18.ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన కర్నె రమేష్ మృతి చెందగా వారి కుటుంబానికి ₹10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు


👉 19.ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన అస్లం కూతురు వివాహానికి ₹5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.


👉 20.పెగడపెల్లి మండలం దేవి కొండ గ్రామానికి చెందిన గోపాల్ కు రోడ్డు ప్రమాదంలో గాయపడగా చికిత్స నిమిత్తం ₹11 వేల రూపాయల ఆర్థిక సహాయం

👉విద్య మరియు ఇతర కార్యక్రమాల పరంగా ఆర్థిక సహాయం.!!

ఫైల్ ఫోటో

👉 1.ధర్మపురి బ్రహ్మోత్సవాలకు అన్నదానానికి ₹10 వేల రూపాయల విరాళం అందించారు


👉 2.ధర్మారం మండల కేంద్రానికి చెందిన సాయి భార్గవ్ కి ITI కారక్పూర్ యునివర్సిటీలో సిట్ వచ్చినదుకు ఖర్చుల నిమిత్తం ₹ 56 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు


👉 3.వెల్గటూర్ మండలం గుల్లకోట గ్రామంలో NAC ద్వార ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషను శిక్షణ కేంద్రాన్ని సంబంధించి షెటర్ అద్దెను  చెల్లించారు.


👉 4.ఎండపెల్లి మండలానికి చెందిన గీతిక ఉమ్మడి KNR SGF అండర్ 17 వాలి బాల్ పోటీలకు ఎంపిక అయినందున ప్రోత్సాహకంగా ₹ 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు


👉 5.ధర్మపురికి చెందిన వేయిట్ లిఫ్టర్ రంగు విరించి స్వప్నిక అంతర్జాతీయ స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్లో ప్రతిభ కనబరిచిన సందర్భంగా తన కోచింగ్ కొరకు ₹ 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు


👉 6.ఎండ పెల్లి మండలం రాజారాం పల్లి గ్రామానికి చెందిన దర్శనాల జమున కుమార్తె ఎంబీబీఎస్ చదువు నిమిత్తం ₹ 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు


👉 7.పెగడ పెల్లి మండలం మద్దుల పల్లి గ్రామానికి చెందిన అంగన్వాడి కేంద్రాలకు 2 బీరువాలు అందజేశారు.


👉 8.ధర్మారం మండలం రామయ్య పల్లె గ్రామానికి చెందిన సిందూజ ఫీజియో థెరపీ కోర్సు చదవడానికి అవసరం అయిన ఫీజు మొత్తం కట్టి స్వయంగా ఎమ్మెల్యే  చెల్లించారు.

👉 9.చెగ్యం గ్రామానికి చెందినట్ల రామయ్య కుమార్తె ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించిన ఫీజు మొత్తం కట్టి స్వయంగా ఎమ్మెల్యే  చదివించడం జరుగుతుంది.