ఎస్సీ వర్గీకరణ సుప్రీం తీర్పును అమలు చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,


ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. సంక్లిష్టమైన ఈ అంశంలో ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు.


👉 గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరమ్ ఫర్ మాదిక, చమర్ ఇతర అనుబంధ కులాలు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గ్లోబల్ మాదిగ డే – 2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.


👉 వర్గీకరణ అంశంలో న్యాయపరమైన చిక్కలు తలెత్తకుండ అమలు చేయాలన్న ఉద్దేశంతోనే అధ్యయనానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనర్సింహా , పొన్నం ప్రభాకర్, ధనసరి సీతక్క తో కూడిన సబ్ కమిటీని నియమించిన విషయాన్ని గుర్తుచేశారు.


👉 అలాగే, వర్గీకరణ అంశంపై 60 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కోరుతూ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శమీమ్ అఖ్తర్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ను నియమించామని, మరో వారం రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉందని చెప్పారు.


👉 ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చామని ముఖ్యమంత్రి పలు సందర్భాలను గుర్తుచేశారు.