👉 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పటిష్ట పోలీస్ బందోబస్త్, పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలి !
👉 జగిత్యాల జిల్లా ఎస్పి అశోక్ కుమార్ !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో శనివారం పోలీస్ స్టేషన్లు పనితీరు పై, నమోదైన కేసుల పై జగిత్యాల్ ఎస్పీ అశోక్ కుమార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పి పెండింగ్ కేసులకు సంబంధించి నేరస్థుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్‌షీట్‌కు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో నమోదైన గ్రేవ్ కేసులు, మహిళలపై నేరాలు, అస్తి నేరాలు, పోక్సో కేసులు, మిస్సింగ్, గంజాయి, రొడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి సమాచారంతో పాటు, కేసుల పరిష్కారం కోసం ఏవిధమైన చర్యలు తీసుకోవడం జరిగిందని మొదలైన అంశాలపై పోలీస్ స్టేషన్ వారిగా పోలీస్ అధికారులతో సమీక్షా నిర్వహించారు.
👉ఈ సందర్భంగ ఎస్పి మాట్లాడుతూ….

గడిచిన 12 నెలల్లో పోలీస్ స్టేషన్ల పనితీరును, కేసుల పరిష్కారంలో సాధించిన పురోగతిని అంచనా వేసుకుంటూ రానున్న సంవత్సరంలో మరింత దృఢ నిశ్చయతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. డిఎస్పి లు, సి. ఐ లు తమ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ లలో నమోదైన వివిధ రకాల కేసులు స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత ఎస్.ఐలకు కేసుల దర్యాప్తు కు సంభందించి సూచనలు ఇవ్వాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా కృషి చేసి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని అన్నారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిదిలో పటిష్ట బందోబస్త్, పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా చూడాలని సూచించారు.
👉 శాంతి భద్రతల పరిరక్షణ కృషి చేసిన అధికారులు, సిబ్బందికి అభినందనలు !
సమర్థవంతంగా విధులు నిర్వహించి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేసిన జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బందికి కృషి అభినందనీయమని ఇదే స్ఫూర్తితో రానున్న సంవత్సరంలో కూడా మరింత రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణ నేర నివారణ నేరచేదినే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు
.
ఈ సందర్భంగ 2024 సంవత్సరం లో విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి, శాంతి భద్రతల పరిరక్షణ విషయం లో మరియు జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలో త్వరితగతిన కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేసినందుకు గా ను అధికారులకు మరియు సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు.

ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డిఎస్పి లు రవీంద్ర కుమార్, రాములు , రంగా రెడ్డి మరియు DCRB, SB ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్, మరియు సి.ఐ లు వేణుగోపాల్, రామ్ నరసింహారెడ్డి రవి, సురేష్ నిరంజన్ రెడ్డి, RI కిరణ్ కుమార్ మరియు ఎస్.ఐ లు, DCRB, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.