శాసనసభ సమావేశాలకు ఏర్పాట్లు!

J.SURENDER KUMAR,


సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభ, నాలుగవ సెషన్ రెండవ సమావేశాల ఏర్పాట్లను ఆదివారం తెలంగాణ రాష్ట్ర శాసన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు. పరిశీలించారు.


సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ , మంత్రి శ్రీధర్ బాబు సూచనలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ఉన్నతాధికారులు, రాష్ట్ర డిజిపి మరియు పోలీసు ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ లో స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడారు


గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలి. సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆదేశించారు.


ప్రభుత్వ అధికారులతో సమన్యయం చేసుకుని సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని లేజిస్లేచర్ సెక్రటరీ నరసింహా చార్యులు ను స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆదేశించారు.