👉 పడి పూజలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు !
J.SURENDER KUMAR,
శ్రీ అయ్యప్ప స్వామి దీక్షలు. పూజాది కార్యక్రమాలతో. ఆధ్యాత్మిక స్వామి శరణు ఘోషల తో ప్రతిధ్వనిస్తున్న రాష్ట్ర ప్రజల అందరిపై శ్రీ అయ్యప్ప స్వామి కృప ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండల కేంద్రం లో మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన శ్రీ అయ్యప్ప స్వామీ మహా పడి పూజ కార్యక్రమం శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
అంగరంగ వైభవంగా మహాపడి పూజ వైభవంగా జరిగింది. అయ్యప్ప దీక్షపరులు పెద్ద సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి భక్తి గీతాలు ఆలపించారు
అనంతరం శ్రీధర్ బాబు మంత్రి మాట్లాడుతూ…

స్వామివారి పడిపూజ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలపై అయ్యప్ప స్వామివారి కృప చల్లనిచూపు తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు