J.SURENDER KUMAR,
శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా ధర్మపురి పవిత్ర గోదావరి నది తీరంలో గల శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో శనివారం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

దత్తాత్రేయ జయంతి సందర్భంగా దత్తాత్రేయుని దివ్యదర్శనం రాత్రి 7:30 గంటలకు దత్తాత్రేయుని డోలోత్సవం తదనంతర మంత్ర జాగరణ తదనంతరం గురు చరిత్ర దత్తుని జన్మ ప్రవచనం తదనంతరం కొంటికర్ల రామయ్యశర్మ బృందం చే భజన కార్యక్రమం జరిగింది.
👉పడిపూజలో…

స్థానిక ధర్మపురి లోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం రాత్రి జరిగిన పడిపూజా కార్యక్రమం లో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.